Friday, September 12, 2025 11:04 PM
Friday, September 12, 2025 11:04 PM
roots

సినీ ఫక్కీలో పోలీసుల చేతికి చిక్కిన వర్రా

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ పోలీసులు ఉక్కు పాదం మోపోతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అత్యంత దారుణంగా రాతలు రాస్తూ పోస్ట్ లు పెడుతున్న వారిపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో పోలీసులు వారిని వేటాడుతున్నారు. దాదాపు 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా జారీ చేసారు. త్వరలోనే మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల వైఎస్ భారతి పిఏ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : కేసీఆర్‌ను కలవరపెడుతున్న మరో అంశం…!

అయినా సరే వైసీపీ నేతల ఆదేశాలతో 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే కడప జిల్లా ఎస్పీని బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆ తర్వాత వర్రా రవీంద్రా రెడ్డి తప్పించుకున్నాడు. దీనితో అతని కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉండవచ్చు అని కూడా భావించారు. ఇక అతని భార్యను అదుపులోకి తీసుకుని కూడా విచారణ చేసారు పోలీసులు. అయితే తాజాగా అతన్ని మహబూబ్ నగర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.

Also Read : టార్గెట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా మృగాల వేట మొదలైంది

వైసిపి నాయకుడు వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్టు చేసారు. మహబూబ్ నగర్ వద్ద అరెస్టు చేసిన ఏపి పోలీసులు, అక్కడి నుంచి విజయవాడ, లేదా కడప తరలిస్తున్నట్టు సమాచారం. కడప పోలీస్ స్టేషన్ విచారణ తర్వాత వర్రా పారిపోయాడు. సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పై ముఖ్య నేతల పై అత్యంత దారుణంగా పోస్ట్ లు పెట్టిన వాడికి 41 ఏ నోటీసులు ఏంటీ అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనితో రవీందర్ రెడ్డి అరెస్టు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తో పాటు డిఎస్పీ సిఐ ల పై ప్రభుత్వం వేటు వేసింది. రేపు మీడియా ముందు వర్రా రవీంద్ర రెడ్డి ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్