గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో చెలరేగిపోతూ రెచ్చిపోతున్న వైఎస్ భారతి పిఏ వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసుల యత్నం చేయగా… పోలీసుల రాక గమనించి పారిపోవడం వివాదాస్పదం అయింది. నిన్న వర్రా రవీంద్ర రెడ్డి నీ అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున 41ఏ నోటీసు ఇచ్చి రవీందర్ రెడ్డిని కడప పోలీసులు వదిలేసారు. మరో కేసులో వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్ళారు. ఈ విషయం ముందే తెలియడంతో పారిపోయాడు వర్రా రవీందర్ రెడ్డి.
Also Read : పోలవరం విషయంలో కీలక ముందడుగు
చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టడమే కాకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు. అసభ్యకర పోస్టుల దృష్ట్యా రవీందర్ రెడ్డిపై కడప తాలూకా పీఎస్ లో కేసు నమోదు చేసారు. రవీందర్ రెడ్డి స్నేహితుడు మహేశ్వర్ రెడ్డిని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వర్రా ఆచూకీ కోసం ఆయన భార్యను పోలీసులు కడప తీసుకెళ్తున్నారు. కడప ఎస్పీ ఆఫీసుకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్… ఎస్పీ హర్షవర్థన్ రాజుతో సమావేశమై పలు కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : కోడెలకు మద్దతుగా పవన్ కళ్యాణ్
ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్రా విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పై చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ పెద్దలు. ఆయనను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసారు. వైఎస్ఆర్ భారతి పీఏ వర్ర రవీందర్ రెడ్డి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వైఎస్ఆర్సీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కూడా సస్పెండ్ చేసిన డీజీపీ… కడప ఎస్పీగా కోయ ప్రవీణ్ ను నియమించే అవకాశం కనపడుతోంది.