సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ప్రభుత్వాధినేతకు అండగా ఉంటారు. కానీ తెలంగాణాలో మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉంది. సిఎం రేవంత్ రెడ్డికి వేరే పార్టీ నుంచి వస్తున్న మద్దతు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకరకంగా ఏపీలో చంద్రబాబు పరిస్థితే రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. విపక్షాలు పచ్చి బూతులు తిడుతున్నా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని నోరు మెదిపే సాహసం చేయరు. ఇది ఆయా పార్టీల కార్యకర్తలకు చికాకు కలిగించే అంశం. ఈ విషయంలో ఎన్ని సార్లు చెప్పినా ఉపయోగం శూన్యమే.
తెలంగాణాలో కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు ఉండదు రేవంత్ రెడ్డికి. కాని బీజేపి నుంచి మాత్రం సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటుంది. హైడ్రా విషయంలో రేవంత్ కు బిజెపి పక్కాగా మద్దతు ఇచ్చింది. చెరువుల్ని ఆక్రమించిన అందరి భవనాలు కూల్చాల్సిందే అని డిమాండ్ చేసింది. డ్రగ్స్, గంజాయి విషయంలో చర్యలపై కూడా బిజెపి మద్దతు తెలిపింది. ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో పరోక్షంగా ప్రభుత్వానికి బిజెపి నుంచి మద్దతు లభించింది. అలాగే మూసీ ప్రాజెక్ట్ విషయంలో కూడా… ఒక్క ఈటెల రాజేంద్ర మినహా మిగిలిన బిజెపి నేతలు అందరూ మద్దతు తెలిపారు.
Also Read : పాదయాత్రకు సిద్ధమంటున్న కేటీఆర్.. ప్లాన్ అదేనా…!
బీఆర్ఎస్ నేతలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేది కూడా బిజెపి నేతలే. జన్వాడ ఫాం హౌస్ విషయంలో కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా రియాక్ట్ అయింది కూడా బిజెపి నేతలే. రేవ్ పార్టీనా రావుల పార్టీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. తాజాగా పాదయాత్ర చేస్తా అని కేటిఆర్ చేసిన ప్రకటనపై కూడా బిజెపి నేతలు కౌంటర్ లు ఇచ్చారు. మోకాళ్ళ యాత్ర చేయాలని.. మాట్లాడుతూ… పది నెలల కాంగ్రెస్ పాలనకు మీకు అలా ఉంటే పదేళ్ళ పాటు మిమ్మల్ని తెలంగాణా ప్రజలు భరించారు అంటూ బండి సంజయ్, రఘునందన్ రావు ఇద్దరూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలా బిజెపి నేతలు అన్ని వైపుల నుంచి రేవంత్ కు అండగా నిలబడుతున్నారు.