ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప 2 సెన్సేషన్ కాబోతుందనే సంకేతాలు బలంగానే వస్తున్నాయి. పుష్ప 1 కు వచ్చిన మౌత్ పబ్లిసిటీ, ఆ సినిమాకు జరిగిన ప్రమోషన్… ఇప్పుడు పుష్ప 2 కు భారీ బజ్ క్రియేట్ కావడంలో హెల్ప్ అవుతున్నాయి. పుష్ప 2 పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్ కు. అటు బాలీవుడ్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై ఓ కన్నేసింది. సినిమా ఆలస్యం అయినా బొమ్మ ఓ రేంజ్ లో ఉండాలని అల్లు అర్జున్, సుకుమార్ కష్టపడుతున్నారు ఇప్పుడు. రిలీజ్ కూడా ఒక రోజు ముందుకు జరిపారు.
సినిమాలో కొంత షూట్ పార్ట్ మిగిలి ఉండటంతో కాస్త ఆలస్యమవుతుందని టాక్. ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ్ కు అన్ని భాషల్లో ప్లాన్ చేసారు. ఇక ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దు అని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లో సినిమాను ప్రమోట్ చేసేందుకు గట్టి స్కెచ్ రెడీ చేసారు. తమిళనాడు, కేరళ, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అయ్యారు. ఇదే సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు పుష్ప మేకర్స్. ఇప్పటికే ప్లేస్ కూడా ఫైనల్ చేసినట్టు టాక్.
Also Read : ప్రభాస్ కత్తికి రెండు వైపులా పదును
ఆంధ్రా, తమిళనాడు బోర్డర్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. చిత్తూరు లేదా తిరుపతిలో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక్కడ నిర్వహిస్తే… మూడు రాష్ట్రాలను కలిపినట్టు ఉంటుందని పుష్ప మేకర్స్ ఆలోచన. కేరళ ప్రమోషన్స్ బాధ్యత ఫాహాద్ ఫాజిల్ డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో ప్రమోషన్స్ ను జాగ్రత్తగా చేస్తే వసూళ్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్ కు రాజకీయ ప్రముఖులను కూడా పిలవాలని ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్.