Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

ప్రభాస్ కత్తికి రెండు వైపులా పదును

ఇండియన్ సినిమాలో రారాజుగా ఒక వెలుగు వెలుగుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ఎవరైనా నిర్మాతలకు ఇప్పుడు కాసుల పంట పండిస్తున్నాడు. బాహుబలి సినిమాతో వచ్చిన అయిదేళ్ళ గ్యాప్ ని ఇప్పుడు ఫాస్ట్ గా కవర్ చేయడానికి ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ప్రభాస్ రేంజ్ లో ఇప్పుడు ఏ ఇండియన్ హీరో చేతిలో 5 భారీ ప్రాజెక్ట్ లు క్యూలో లేవు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల డైరెక్టర్ లు గతంలో భారీ బడ్జెట్ సినిమాలు చేయకపోయినా ఈ రెండు సినిమాలు మాత్రం భారీ బడ్జెట్ తో వస్తున్నాయి.

ఇక స్పిరిట్ విషయానికి వస్తే యానిమల్ పార్క్ తో సందీప్ రెడ్డి వంగా తాను ఏంటీ అనేది పాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కీ 2 ఉన్నాయి. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. ఒక హీరో చేతిలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు ఇన్ని ఉన్నా సరే నిర్మాతలకు ఏ మాత్రం టెన్షన్ లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ కాదు. బాలీవుడ్ హిట్ సినిమాల కంటే ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తున్నాయి. వసూళ్ళతో పెట్టిన పెట్టుబడి వచ్చేస్తోంది.

Also Read : సత్తా చాటిన సౌత్ సినిమా.. వీళ్ళే దీపావళి విన్నర్స్

ఇక ఓటీటీ మార్కెట్ విషయంలో ప్రభాస్ ఇప్పుడు కింగ్ అనేది క్లియర్ పిక్చర్ వస్తోంది. ఎస్ ఓటీటీ మార్కెట్ లో ప్రభాస్ ఇప్పుడు రాజు. సలార్, కల్కీ సినిమాల రైట్స్ విషయంలో ఓటీటీ సంస్థలు చూపించిన ఆసక్తే ఇందుకు నిదర్శనం. సలార్ హిందీ రైట్స్ ను హాట్ స్టార్ కొంటే, తెలుగు సహా సౌత్ లాంగ్వేజెస్ రైట్స్ నెట్ ఫ్లిక్స్, కల్కీ విషయంలో కూడా అంతే… హిందీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కూడా అమెజాన్… సౌత్ రైట్స్ తీసుకుంది. ఓ వైపు వసూళ్లు మరోవైపు ఓటీటీ మార్కెట్ తో ప్రభాస్ కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్