Friday, September 12, 2025 09:13 PM
Friday, September 12, 2025 09:13 PM
roots

బిగ్ బ్రేకింగ్: వల్లభనేని వంశీ అరెస్ట్ కు రంగం సిద్దం

కృష్ణా జిల్లా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ కు రంగం సిద్దమైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో థర్డ్ చాప్టర్ కు రంగం సిద్దమైందని… కావాలంటే గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. మూడో చాప్టర్ లో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన రాజకీయ నాయకులే ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తరుణంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను ఎలా అయినా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వంశీ విజయవాడ సివిల్ కోర్ట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. కానీ వంశీని అరెస్ట్ చేయలేదు. అయితే తన అరెస్ట్ పై సమాచారం ఉన్న వంశీ… లాయర్ల ముసుగులో తన అనుచరులను కోర్ట్ కు తీసుకు వెళ్ళారు. అయితే వంశీని అదుపులోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : మూడో చాప్టర్ లో ఉన్న నాయకులు వీళ్లేనా…?

వంశీ ముఖ్య అనుచరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యతేంద్ర రామకృష్ణ (రాము) అరెస్ట్ చేసిన ఆత్కూర్ పోలీసులు… స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన రాళ్ల దాడి కేసులో అరెస్టు చేశారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం గతంలో జరిగిన భార్యాభర్తల గొడవలో మెయింటినెన్స్ కి కోర్టును ఆశ్రయించిన రాము భార్య ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.

మెయింటేనెన్స్ పై అరెస్ట్ వారెంట్ వచ్చిందని ఆత్కూర్ పోలీసులు తెలిపారు. యతేంద్ర రామకృష్ణ ను కోర్టుకి హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. కాని ఈ అరెస్ట్ వెనుక రెడ్ బుక్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ అనుచరులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన అనంతరం వంశీని అదుపులోకి తీసుకోవచ్చు అంటున్నారు. ఇటీవల మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వంశీపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్