Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

వార్నింగ్ ఇస్తున్నా పట్టించుకోని ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేలు అధినేతలను లెక్క చేయడం లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. రాజకీయంగా విపక్షం బలహీనంగా ఉన్నా కొందరు నేతల వ్యవహారం మాత్రం కొంప ముంచే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అధినేతలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ సమస్యలు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పని తీరు విషయంలో కూటమి సర్వేలు చేయించడం మొదలుపెట్టింది.

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే ఓ సర్వే పూర్తి చేసి మార్కులు కూడా ఇచ్చారు. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎంపీలలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మొదటి స్థానంలో ఉంటే… వైసీపీకి చెందిన ఓ ఎంపీ ఆఖరి స్థానంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల పని తీరు విషయంలో, మంత్రుల పేషీల విషయంలో ఆ సంస్థ కీలక విషయాలను తమ వేగుల ద్వారా తెలుసుకుని సిఎంకు నేరుగా అందించింది. ప్రజలతో, కార్యకర్తలతో ఆ సంస్థ నేరుగా మాట్లాడి కీలక విషయాలను సేకరించడం మొదలుపెట్టింది.

Also Read : రెడ్ బుక్ మూడో చాప్టర్.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలు ఇసుకలో జోక్యం చేసుకుంటున్నారా…? మద్యం విషయంలో ప్రమేయం ఉందా…? స్థానికంగా ఉన్న సహజ వనరుల విషయంలో అక్రమాలు ఉన్నాయా…? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, వ్యాపారాలు చేసుకుంటున్నారా…? మంత్రులు మీ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారా…? ఇలాంటి కీలక ప్రశ్నలు నేరుగా ప్రజలనే అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ నాయకులను హెచ్చరిస్తున్నా సరే… వారిలో మార్పు రావడం లేదట. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఇంకా 5 ఏళ్ళు ఉందిగా అని ధీమాగా ఉండటం సమస్యగా మారిందని ఆ సంస్థ హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ టిడిపి అధినేతకు నివేదిక అందించినట్లు తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్