Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

నీకో నీతి… నాకో నీతి… ఇదే రాజనీతి…!

ప్రస్తుత రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయనేది వాస్తవం. గతంలో రాజకీయ నేతలు విధానపరమైన ఆరోపణలు చేసుకునే వారు. అదే సమయంలో కుటుంబ పరంగా సఖ్యతగా కూడా మెలిగే వారు. ఏదైనా శుభకార్యాల్లో ముఖాముఖి కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించుకునే వారు కూడా. రాజకీయ పరమైన విమర్శలు తప్ప… వ్యక్తిగతమైన, కుటుంబపరమైన ఆరోపణలు చేసుకున్న సందర్భాలు లేవు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది.

సోషల్ మీడియాలో ప్రత్యర్థిని వ్యక్తిత్వ హననం చేయడం… ఆడవారిని, కుటుంబ సభ్యులను కించపరిచేలా కామెంట్ చేయడం… రాజకీయ వైరం ఉంటే… దానిని వ్యక్తిగతంగా పగ తీర్చుకునేందుకు వాడుకోవడం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ అనే లైవ్ షో నిర్వహించారు. ఇందులో ఒక దశలో రాజకీయాలు విడిచిపెట్టాలనుకున్నా అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో తన కుటుంబం జోలికి వచ్చిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ కుటుంబ సభ్యుల రేవ్ పార్టీ గురించే చర్చ నడుస్తోంది. బంధువు రాజా పాకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైంది కూడా. ఇదే సమయంలో ఆ పార్టీలో కేటీఆర్ భార్య కూడా ఉన్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

Also Read : తెగించిన నీలి మీడియా.. మళ్ళీ ఫేక్ ప్రచారం

అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డిని అర్థరాత్రి పూట ఇంటికి వెళ్లి.. బెడ్ రూమ్‌లో ఆడవాళ్ల ముందే అరెస్ట్ చేసినప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కూడా ఇంట్లోకి వెళ్లి బలవంతంగా లాక్కొచ్చి అరెస్ట్ చేశారు. అదే సమయంలో కేటీఆర్ అత్యంత ఆప్తుల్లో ఒకరైన బాల్కా సుమన్… గతంలో రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌ను ప్రెస్ మీట్‌లోనే బూతులతో రెచ్చిపోయాడు బాల్కా సుమన్. ఆ రోజు ఎందుకు ఖండించలేదంటున్నారు.

ఇక తాజాగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావుల ఫోటోపైన బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్ట్ చేశారు. ఇవి పెద్ద దుమారమే రేపాయి. ఓ మహిళా మంత్రిపై ఈ తరహా తప్పుడు కామెంట్ చేసిన వ్యక్తిని కేటీఆర్ ప్రొత్సహించాడనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేటీఆర్ తన కుటుంబం విషయం ప్రస్తావించేసరికి… ఇలాంటి బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసం అంటున్నారు నెటిజన్లు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్