ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల వ్యవహారశైలి విషయంలో సిఎం చంద్రబాబులో మరోసారి ఆందోళన మొదలయింది. చాలా మంది మంత్రులు రాజకీయ విమర్శల పట్ల మౌనంగా ఉండటం పట్ల కార్యకర్తల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం పై విమర్శలు వచ్చే సమయంలో ఎక్కువగా స్పందించాల్సింది మంత్రులే. కేబినేట్ నిర్ణయాలు లేదంటే సంక్షేమ కార్యక్రమాల అమలు, విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల గురించి వేగంగా స్పందించి సమాధానం చెప్పాల్సింది మంత్రులే. అలాగే కొన్ని కీలక అంశాల్లో సిఎంకు అండగా నిలబదాల్సింది మంత్రులే.
కాని ఏపీలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. వైసీపీ హయాంలో పాలన ఎలా ఉన్నా మీడియా ముందు మంత్రులు మాట్లాడేవారు. జగన్ పై ఈగ వాలనీయకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబును విమర్శిస్తున్నా, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను చంద్రబాబుకు లింక్ చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నా… ఉచిత ఇసుక విధానం అలాగే గ్యాస్ సిలెండర్లు ఉచిత పంపిణీకి సంబంధించి మంత్రులు మాట్లాడాల్సి ఉంది. పెన్షన్ లు 4 వేలు ఇవ్వడం అనేది ఒక సంచలనం.
Also Read : జగన్ కు ఇక బ్యాండ్ బాజా బారాత్ మొదలు…!
దానికి సంబంధించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. అలాగే ఉచిత బస్ ప్రయాణంపై, విద్యార్ధులకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కౌంటర్ లు ఇవ్వాల్సి ఉంది. వైసీపీ హయాంలో ఆరు నెలల తర్వాతనే కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెన్షన్ మొదటి ఏడాది పెంచింది కేవలం 250 మాత్రమే. ఇవన్నీ ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. తాజాగా దీనిపై సిఎం చంద్రబాబు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని హెచ్చరించారు. మరి ఇప్పటికి అయినా మంత్రులు బయటకు వస్తారా లేదా అనేది చూడాలి.