Saturday, September 13, 2025 04:22 PM
Saturday, September 13, 2025 04:22 PM
roots

షర్మిలతో రాజీ.. రంగంలోకి సూరీడు..!

అన్న చూస్తే సిఎం అయిండు… చెల్లెలు చూస్తే గ్రామ సర్పంచ్ కూడా కాలే… ఎంపీ అయ్యే పర్సనల్ ఇమేజ్ ఉన్నా… అన్న స్వార్ధంతోని రాజకీయాల్లో పదవులు లేకుండానే, పార్టీ పదవులతోని ప్రజా సేవ చేసుడు అంటే సాధ్యం కాని యవ్వారం. ఇప్పుడు ఏపీలో పీసీసీ చీఫ్ షర్మిల పరిస్థితి ఇట్లనే ఉంది. వైఎస్ ముద్దుల కుమార్తెగా కంటే జగనన్న వదిలిన బాణంగనే మస్త్ ఫేమస్ అయినరు షర్మిల. 2012 లో అన్నను జైల్లో ఉంచినప్పుడు ఉమ్మడి ఏపీలో 1600 కిలో మీటర్లు ఓ మహిళగా పాదయాత్ర చేసుడు అంటే నాట్ ఏ జోక్.

2014 ఎన్నికలల్లో ఖమ్మం ఎంపీ అయిదమని విశ్వ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలే. అన్న క్లోజ్ దోస్త్ పొంగులేటి సీనన్నకు సీటు ఖరారు చేసుడు, అన్న ఎంపీ అయిపోవుడు, గులాబీ పార్టీలో చేరుడు అన్నీ శురు అయినై. అన్న క్లోజ్ దోస్త్ లు అందరూ రాజకీయాలల్ల… ప్రజా ప్రతినిధులుగా చేస్తే… ఒకే రక్తంతోని పుట్టి… ఒకే కంచంల తిని, కలిసి మెలిసి ఆడుకున్న చెల్లెలు మాత్రం అన్నకు అక్కర రాలే. అందుకే బిగబట్టి పార్టీ పెట్టి… కేసీఆర్ పై పోరాటం చేసి… పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవిలో కూసున్నది.

Also read : నామినేటెడ్ జాబితా సిద్ధం… ఈసారి వారికే ప్రాధాన్యత…!

ఎమ్మెల్యే కంటే పీసీసీ చీఫ్ పవర్ ఫుల్… ఇప్పటి వరకు పీసీసీ చీఫ్ లుగా చేసిన చాలా మంది సిఎంలు అయిన్రు. వైఎస్, రేవంత్… సహా కొందరు సిఎంలు అయితే మరికొందరు మంత్రులు అయిన్రు. పీసీసీ చీఫ్ పదవి ఇచ్చుడు అంటే అంత ఆషామాషీ యవ్వారం కాదు. సమర్ధత ఉంటేనే దక్కుతది… పీసీసీ కుర్చీలో ప్రెసిడెంట్ గా కూసొనుడు అంటే… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో కూసున్నట్టే. అందుకే ఇప్పుడు అన్నకు భయం పట్టుకున్నది… తెలంగాణాకు పరిమితం అయితది అనుకున్న చెల్లెలు… రహస్య దోస్త్ ను ఓడించి ఏపీలో అడుగు పెట్టి తనను ఓడించింది.

షర్మిల ఎవరి మీదనైనా పోరాటం చేస్తే ఒడినట్టే… ఇప్పుడు ఏపీలో మస్త్ కష్టపడుతున్నది. కాంగ్రెస్ కు అన్నను దగ్గర కానీయట్లే. అందుకే అన్న దిమాక్ తోని ఆలోచన చేసి… చెల్లెలుతో రాజీకి పోతున్నాడు. ఊరక ఊరక బెంగళూరు పోతున్న అన్న… చెల్లెలుతో రాజీ చేయాలని… నాయిన క్లోజ్ దోస్త్ సూరీడుకి బాధ్యతలు అప్పగించిండు. అందుకే సూరీడు షర్మిలతోని హైదరాబాద్ లో మీటింగ్ షురూ చేసిండని టాక్. కొన్ని కండీషన్లు అన్నకు కూడా పంపగా మెజారిటీ కండిషన్లకి అన్న ఓకే చెసిండు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అన్నను టెన్ జన్ పద్ గడప ముందు నిలబెట్టుడే అంటున్నది చెల్లెలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

పోల్స్