ప్రతిపక్షంలో అయినా కూర్చుంటా గాని అబద్దం మాత్రం చెప్పను అంటూ వైసీపీ అధినేత జగన్ గురువారం చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు అబద్దాలు చెప్పి సీఎం అయ్యాడని, కానీ తాను మాత్రం ప్రజలకు అబద్దాలు చెప్పడం ఇష్టంలేకే ఓడిపోయా అని చెప్పే ప్రయత్నం చేసారు. గత అయిదేళ్ళ జగన్ పాలన చూసిన ఎవరికి అయినా ఆ మాటలు వింటే చాలా ఆశ్చర్యంగానూ, ఆపుకోలేనంత నవ్వు రావడం సహజం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జగన్ చెప్పేవి వైసీపీ కార్యకర్తలకు మాత్రమే నిజాలుగా కనపడినా… ప్రజలు మాత్రం మరువలేదు.
అమరావతిలోనే రాజధాని అని ఎన్నికల ముందు 2019 లో చెప్పారు. ఇల్లు కూడా కడుతున్నా అని కట్టారు. కానీ విశాఖ రాజధాని అని అక్కడ ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ స్థలంలో ఒక ఇల్లు కట్టారు. అమరావతి విషయంలో జగన్ మాట్లాడిన ప్రతీ మాట అబద్దమే అనే విషయం ప్రజలకు క్లారిటీ ఉంది. అలాగే సొంత బాబాయిని చంపిన విషయంలో జగన్ చాలా విన్యాసాలు రాష్ట్ర ప్రజలకు చూపించారు. అది ఆయన మర్చిపోయినా ప్రజలకు గుర్తుంది. ముందు సిబిఐ విచారణ కావాలని అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దని… నేరస్తులను కాపాడే ప్రయత్నం జగన్ చేసారు అప్పట్లో.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో చేపించేస్తాలే అన్నా అంటూ సిపీఎస్ విషయంలో జగన్ మాట్లాడిన వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. కాని అది రద్దు కాలేదు, ఆ విషయంలో ఒక్క అడుగు కూడా పడలేదు. జాబ్ కేలండర్ విషయంలో జగన్ అప్పుడు చెప్పిన మాటలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. మెగా డీఎస్సీ అంటూ కూడా మాట్లాడారు. వాటిల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మద్యపాన నిషేధం… నూతన ఎక్సైజ్ పాలసీ విషయంలో ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడే ముందు గతం గుర్తుంచుకుంటే మంచిది అంటున్నారు పలువురు.
Also Read : అధికారం పోయినా పెత్తనం మాత్రం రెడ్డి గార్లదే..!
మద్యం అనేది కేవలం స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం అన్నారు అప్పట్లో. ధరలు పెంచి ఓ ప్లాన్ ప్రకారం డిజిటల్ పేమెంట్స్ ఆపి దోచుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మద్యపాన నిషేధం జరగకపోగా పెద్ద ఎత్తున దోపిడి జరిగింది. అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రాన్ని వంచుతామని జగన్ వంగిపోయారు. పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తా అంటూ ప్రగల్భాలు పలికారు. 5 సంవత్సరాల్లో కనీసం 5% పనులు పూర్తి చేయలేకపోయారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలను పాడుబెట్టి ప్రజల సొమ్ముని వృధా చేశారు. చేసినవన్నీ చేసేసి ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబితే నమ్మే స్థితిలో ప్రజలు ఉన్నారా అని జగన్ ఆలోచించుకుంటే మంచిది.