Friday, September 12, 2025 10:59 PM
Friday, September 12, 2025 10:59 PM
roots

కూటమి సర్కారులో కూడా పెత్తనం వారిదే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు ఇబ్బందులు పడిన తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఇక తమకు మంచి రోజులు వచ్చాయని సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఇదంతా మూన్నాళ్ళ ముచ్చట అని తేలిపోయింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. పది రోజులు పాటు సాగిన ఈ ఉత్సవాల్లో దాదాపు 12 లక్షల మంది పైగా భక్తులు దుర్గమ్మని దర్శించుకున్నారు. ఇక దసరా నవరాత్రుల సందర్భంగా గుడికి వచ్చిన భక్తులకు అన్నదానం తో పాటు ప్రసాదం పులిహోర, లడ్డు, చిన్నపిల్లలకి పాలు సరఫరా చేశారు.

గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని కొండచరియలు విరిగిపడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులు, భవానీలు కూడా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు గుడిలో చాలా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దుర్గగుడిలో ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలో అధికారం చలామణి చేసిన నాయకులు, అధికారులదే హవా. చిన్న చిన్న పనులు మొదలు ప్రోటోకాల్ దర్శనాల వరకు ప్రతిదీ కూడా మాజీ మంత్రులు, ఎలాంటి పదవి లేని వైసీపీ నేతలదే పెత్తనం. అసలు కొండమీద ఏం జరుగుతుందో కూడా కూటమి నేతలకు అర్థం కాని పరిస్థితి.

Also Read : ఆలపాటి గెలుపు సులువేనా..?

శరన్నవరాత్రులు సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన టిడిపి, జనసేన పార్టీల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులను కూడా అధికారులు ఏమాత్రం లెక్క చేయలేదు. బాగా గుర్తింపు ఉన్న నేత అయితే తప్ప బాగున్నారా అనే పలకరింపు కూడా అధికారుల నుంచి రాలేదు. అదే సమయంలో వైసీపీకి చెందిన నేతలకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు. ఈవో సహా మిగిలిన అధికారులు కూడా దగ్గరుండి మరి సాదరంగా ఆహ్వానించారు. నేరుగా అంతరాలయంలోకి తీసుకెళ్లి ప్రోటోకాల్ దర్శనం చేయించారు. వేద ఆశీర్వచనము, శాలువాతో సత్కారము, ప్రసాదము, ప్రత్యేకంగా అమ్మవారి చిత్రపటం కూడా బహుకరించారు.

ఇదేంటని అడిగితే మాకేం తెలుసు అని విచిత్రమైన సమాధానం చెప్పేసి వెళ్ళిపోయారు. చివరికి మీడియా మిత్రులకు సైతం పలు సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అధికారులు ఇచ్చిన పాసులతో మాకేంటి సంబంధం అన్నట్లుగా కొందరు ఆలయ అధికారులు, విధి నిర్వహణకు వచ్చిన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్, మల్లాది విష్ణు… ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామందికి ఆలయ అధికారులు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.

ఇక కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ వారు మాత్రం నేరుగా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. వైద్య శాఖ సిబ్బంది అయితే మరో అడుగు ముందుకేసి… అత్యవసర సమయంలో వినియోగించేందుకు సిద్ధం చేసిన 108 అంబులెన్స్ లో తమ వారిని తీసుకొని కొండపైకి వెళ్తూ పోలీసులకు దొరికిపోయారు. దసరా శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించినట్లు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ… కొండపై మాత్రం ఇప్పటికి వైసీపీ నేతలే పెత్తనం చెలా ఇస్తున్నారని వీఐపీలు మొదలు సాధారణ భక్తుల వరకు ఆరోపిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్