Saturday, September 13, 2025 10:26 PM
Saturday, September 13, 2025 10:26 PM
roots

ఏపీలో కొత్త జిల్లాలు ఇవేనా…?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య పెరుగుతుందా అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు 13 జిల్లాలు ఏపీ పరిధిలోకి వచ్చాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, కోస్తాంధ్ర 6, రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలు కలిసి మొత్తం 13 జిల్లాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ 2014 చంద్రబాబు ప్రభుత్వం వాటిని విభజించలేదు. అయితే వైసీపీ పాలనలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు మాజీ సీఎం వైఎస్ జగన్. వాస్తవానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ప్రకటించిన జగన్… అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజించారు. దీంతో 25 పార్లమెంట్ స్థానాలున్న ఏపీ 26 జిల్లాలుగా ఏర్పడింది.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని ప్రాంతాల్లో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ప్రధానంగా మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అలాగే హిందూపురం, మదనపల్లె వాసులు కూడా ప్రత్యేక జిల్లా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ మాత్రం అవన్నీ సాధ్యం కావని కోట్టిపారేశారు. రాజంపేట పార్లమెంట్ పరిధిని అన్నమయ్య జిల్లాగా, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాగా నామకరణం చేశారు. ఇక కొన్ని జిల్లాలకు పేర్ల విషయంలో కూడా వివాదం రేగింది. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని ఓ వర్గం నేతలు డిమాండ్ చేశారు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్టి రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు అగ్నికి ఆజ్ఞం పోసింది. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా మార్పులు చేర్పులు చేపడతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఏపీలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ నోట్ సర్క్యూలేట్ అవుతోంది. ఇందులో పలు కొత్త జిల్లాలతో పాటు పాత జిల్లాను మారుస్తున్నట్లుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. పలాస కేంద్రంగా ఒక జిల్లా, శ్రీకాకుళం కేంద్రం నాగావళి జిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఇక పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా పేర్లు అలాగే ఉంచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు నర్సీపట్నంను జిల్లా కేంద్రం చేయనున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు యధాతథం. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు కృష్ణా జిల్లా అని పేరు పెట్టారు. ఇక కొత్తగా నూజివీడు, అమరావతి, తెనాలి జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు అమరారామ అని పేరు పెట్టారు. ఇదే సమయంలో బాపట్ల జిల్లాను రద్దు చేశారు. ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా పేరు ప్రకటించారు. కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలను అలాగే కొనసాగిస్తున్న ప్రభుత్వం… కొత్తగా మదనపల్లె, హిందూపురం, ఆదోని జిల్లాలను రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. 5 ఎకనామిక్ క్లస్టర్లుగా 30 జిల్లాలను విడదీస్తున్నట్లు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. మరి దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్