Friday, September 12, 2025 09:01 PM
Friday, September 12, 2025 09:01 PM
roots

అప్పుడు పొగిడారు… ఇప్పుడు ఏమయ్యారు…?

ఏపీలో వైసీపీ నేతల తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధినేత, నాటి సీఎం జగన్‌పైన పొగడ్తల వర్షం కురిపించారు వైసీపీ నేతలు. ఇంటా బయటా, అసెంబ్లీలో, వెలుపలా, పార్టీ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అనే తేడా లేకుండా జగన్‌పైన తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కొందరు నేతలైతే జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు కూడా. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు, కొడాలి నాని, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే బహిరంగంగానే నోటీకి వచ్చిన బూతులతో రెచ్చిపోయారు.

దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తినా కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి ఖండనా రాలేదు. పైగా ఇలా తిట్టిన వారికే కీలకమైన పదవులిచ్చారు జగన్. ఇక కొందరు మహిళా నేతలైతే అసెంబ్లీ వేదికగానే జగన్ కీర్తనలు కూడా పాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి టిక్ టాక్ వీడియోలు చేయగా… మాజీ మంత్రి రోజా అయితే ఏకంగా దేవుడి గదిలోనే జగన్ ఫోటో అతికించారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది. గతంలో పదవులు అనుభవించిన నేతలెవరూ ఇప్పుడు కనీసం మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు రోజా మాత్రం వీడియోలో వాయిస్ రిలీజ్ చేస్తున్నారు తప్ప… క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.

Read Also : వీఐపీ సంస్కృతి వద్దు, కొండపై గోవింద నామస్మరణ ఒక్కటే, చంద్రబాబు సంచలన ఆదేశాలు

ఇక పుష్ప శ్రీ వాణి అయితే ఎక్కడున్నారో తెలియదు. మాజీ హోమ్ మంత్రులిద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ అసెంబ్లీ గొప్పగా మాట్లాడిన అనిల్… ఓడిపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతా అంటూ చేసిన సవాల్ మర్చిపోయి మళ్లీ నెల్లూరు వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కనిపించడం లేదని శ్రీకాళహస్తిలో పోస్టర్లు కూడా వేశారు. ఇక మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వర్రావు, ఉష శ్రీ చరణ్ అయితే పార్టీ మారేందుకు యత్నిస్తున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

చివరికి వైసీపీలో నెంబర్ టూ స్థానం కోసం తెగ ప్రయత్నం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు తర్వాత పెద్దిరెడ్డి పేరు ఎక్కడా వినిపించటం లేదు. చివరికి సొంత జిల్లాలోని తిరుమల లడ్డూ వివాదంపై కూడా పెద్దిరెడ్డి కనీసం స్పందించలేదు. దీంతో నాడు జగన్‌‌పై పొగడ్తల వర్షం కురిపించిన నేతలంతా ఇప్పుడు ఏమయ్యారనే ప్రశ్న తలెత్తుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్