Saturday, September 13, 2025 06:44 PM
Saturday, September 13, 2025 06:44 PM
roots

ఎన్నాళ్ళీ దరిద్రం.. రగిలిపోతున్న టీడీపీ ద్వితీయ నాయకత్వం

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… ఎస్సైలు, సిఐ లను కూడా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అవలీలగా మార్చేది. తమకు అనుకూలంగా లేకపోతే ఎవరిని ఎక్కడికి అయినా మార్చడంలో ఆ నాయకత్వం సక్సెస్ అయ్యేది. ఈ విషయం తెలుసుకున్న కొందరు పోలీసు అధికారులు… వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించే వారు. ఈ విషయంలో టీడీపీ గతంలో ఎన్నో ఆరోపణలు చేసింది. ఏకంగా ఒక ఎస్సై చంద్రబాబుని అనపర్తిలో అడ్డుకునే వరకు వెళ్ళారు అంటే ఏ స్థాయిలో వైసీపీ ప్రభావం ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

ఒకటి భయం కాగా.. రెండు పదోన్నతి పిచ్చి. అందుకే చాలా మంది పోలీస్ అధికారులు ఉద్యోగం చేస్తున్నాం అనే విషయం మరచి జేబులో జగన్ ఫోటో పెట్టుకుని తిరిగారు. కొందరు తమ ఫోన్ ల వెనుక జగన్ బొమ్మలు కూడా అతికించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి చేసేది ఉద్యోగం… ఊడిగం కాదు అనే విషయం తెలుసుకోవాలి గాని ఇంకా కొందరు అధికారులలో మార్పు రాలేదు. రాకపోతే రాకపోయింది గాని… చాలా మంది పోలీస్ బాస్ లు, ఎక్సైజ్ అధికారులు ఇంకా వైసీపీ నేతలకే సహకరిస్తున్నారు.

Read Also : కాళ్ళ బేరానికి గనుల వెంకట రెడ్డి

చాలా చోట్ల ఇంకా గంజాయి వాడకం ఉంది. అలాగే అక్రమ మద్యం వ్యాపారం కూడా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా కూడా ఎక్కడా వైసీపీ నేతలు ఆపలేదు. వైసీపీ అగ్ర నాయకత్వం నుంచి అధికారులకు ఫోన్ లు వెళ్ళడం కూడా జరుగుతోంది. సాక్షాత్తు రాజధాని గ్రామాల్లోనే ఇంకా కొందరు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా అడ్డుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరు వైసీపీ నేతలు రహస్యంగా అధికారులను కూడా కలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని చూస్తున్న టీడీపీ ద్వితీయశ్రేణి నాయకత్వం షాక్ అవుతోంది.

ఇంకెన్నాళ్ళు మాకు ఈ దరిద్రం, కనీసం పోలీసులు ఆపిన టూ వీలర్ కూడా విడిపించుకోలేని దరిద్రంలో మేము ఉంటే… వాళ్ళు ఇసుక కూడా తోలుకుంటున్నారు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎన్ని బదిలీలు చేసినా కొందరు పోలీసుల కాకీ బట్టల వెనుక గుండెల్లో జగన్ ఉన్నాడని వాపోతున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ పద్ధతి ఎక్కువగా ఉందట. కనీసం తమ ఆవేదన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వినలేకపోతున్నారు అని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి ఇది ఎప్పటికి మారుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్