Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో నిర్వహిస్తున్న బ్రహ్మత్సవాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల పాటు స్వామి వారు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించారు. ఆ తర్వాత కూడా ఆలయంలో చేపట్టిన పలు కార్యక్రమాలు విమర్శలకు తావిచ్చాయి. వైసీపీ రంగులున్న లైటింగ్ వేశారని, ఆలయంపై శిలువ ఆకారంలో ఉన్న లైటింగ్ వేశారంటూ భక్తులు విమర్శలు చేశారు. ఇక అన్న ప్రసాదం నాణ్యతపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. ఇక క్యూ లైన్లల్లో భక్తుల పాట్లు అయితే వర్ణనాతీతం. దీంతో కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టిందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను వేద మంత్రాల నడుమ.. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న చక్రస్నానంతో స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఏడుకొండల వాడు కొలువై ఉన్న తిరుమల దివ్య క్షేత్రం దేదీప్య మానంగా వెలుగుతోంది. అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వేద మంత్రాల నడుమ… వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం… పండితులు అంకురార్పణ చేశారు. 9 రోజుల పాటు స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి వారి వాహనాల్లోనే అతి ముఖ్యమైన గరుడ వాహన సేవ రోజున ఏకంగా 2 లక్షల మంది భక్తులు స్వామి వారి వాహన సేవను దర్శించుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉభయ దేవేరులతో వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామి వారికి అర్చకులు నిత్యం మంగళ స్నానం నిర్వహిస్తారు. స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజు సాయం సంధ్య సమయంలో అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ నిర్వహించనున్నారు. ధ్వజారోహణకు ప్రత్యేకంగా తయారు చేసిన దర్భ చాప, తాడును సిద్ధం చేశారు. ఈ క్రతువులో దర్భ చాప, తాడు చాలా ముఖ్యమైనవి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచిక ధ్వజారోహణం. ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.

Read Also : చంద్రబాబు ఢిల్లీ టూర్, అమరావతికి రైల్వే స్టేషన్…? గురువారం జరగబోయే చర్చ ఏంటీ…?

రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుట్టడంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేసింది. ఈ దర్భలో … శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భ మాత్రమే ఉపయోగిస్తున్నారు. దర్భను సేకరించిన టీటీడీ అటవీ సిబ్బంది….. తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్భను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు.

వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలోని ఆనంద నిలయం మొదలు… బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని ఈ నెల ఒకటో తేదీన శుద్ధి చేశారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ క్రతువులో జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, ఈవో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ధ్వజారోహణం తర్వాత స్వామి వారు తొలి రోజున పెద శేష వాహనంపై ఊరేగనున్నారు.

ప్రతి రోజు రెండు వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక చివరి రోజున ఈ నెల 12వ తేదీన ఉదయం 6 గంటలకు స్వామి వారి చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు. స్వామి వారి పుష్కరిణిని దాదాపు నెల రోజులుగా టీటీడీ అధికారులు శుద్ధి చేశారు. ఆగస్టు నెలలోనే పుష్కరిణిలో నీటికి పూర్తిగా ఖాళీ చేశారు. పది రోజుల పాటు ఫుష్కరిణిలో మరమ్మతులు చేపట్టిన తర్వాత… సెప్టెంబర్ నెలలో పుష్కరిణిలో నీటిని నింపారు. చక్రస్నాన మహోత్సవం సందర్భంగా స్వామి వారి కోనేరులో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానం ఆచరిస్తారు. ఇందుకోసం టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్