Monday, October 27, 2025 07:47 PM
Monday, October 27, 2025 07:47 PM
roots

ఎమ్మెల్యేలే టీడీపీ కొంప ముంచుతున్నారా…?

2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పరిపాలన విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. కాని చంద్రబాబు పై మాత్రం 23 సీట్లు వచ్చే అంత వ్యతిరేకత అయితే అప్పట్లో లేదు. 2019 లో చంద్రబాబుకు పాజిటివ్ గా వాతావరణం కనపడినా ఫలితాలు మాత్రం చాలా భిన్నంగా వచ్చాయి. దీనికి కారణం పైన చంద్రబాబు గెలవాలి, కానీ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి అని ప్రజలు ఆశించారు. ఎమ్మెల్యేల పని తీరు విషయంలో సీరియస్ గా ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే ట్రెండ్ కొనసాగింది. జగన్ ఒక్క అవకాశం అనే మాట కంటే ఇదే ఎక్కువ ప్రభావం చూపించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు కూడా అదే సీన్ మొదలయింది. చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబుపై సానుకూలత ఉన్నా ఎమ్మెల్యేలు మాత్రం ఆ సానుకూలతను కాపాడుకోవడంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. అనవసర విషయాల్లో తల దూర్చడంతో పాటుగా వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా, గ్రావెల్ ఇలా అన్ని విధాలుగా ఎమ్మెల్యేలు సంపాదించడం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళే సాహసం గాని ప్రయత్నం గాని చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సోషల్ మీడియా మీద కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టడం లేదు.

Read Also : అయ్యా ఎస్ లను వదలని పాపాలు, ప్రవీణ్ ప్రకాష్ జైలుకే

అధికారంలో లేని సమయంలో ఏదో రకంగా నెట్టుకు వచ్చింది పార్టీ. కాని ఇప్పుడు కూడా పదవుల్లో ఉండి సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటున్నారు. దానికి తోడు అక్రమ సంపాదన వ్యవహారాల్లో కూడా బిజీ అయిపోయారు. చంద్రబాబు వరదల్లో కష్టపడుతుంటే కొందరు ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండిపోయారు. తమ తమ నియోజకవర్గాల్లో వసూళ్ళతో బిజీ అయిపోయారు. అందుకే ఇప్పుడు ప్రజలు మళ్ళీ పైన చంద్రబాబు ఉండాలి గాని కింద వీళ్ళు వద్దు అనే మాట మాట్లాడటం మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో గ్రౌండ్ లో ఎమ్మెల్యే అభ్యర్ధుల కష్టం కంటే పార్టీ అధిష్టానమే ఎక్కువగా కష్టపడింది. జగన్ పై వ్యతిరేకత పెంచింది. ఇదే కొనసాగితే మాత్రం పార్టీ ఇబ్బందుల్లో పడడం తధ్యం. ఎంత ఘనంగా అధికారంలోకి వచ్చిందో.. అంతే ఘోరంగా అధికారం కోల్పోవడం కూడా ఖాయం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్