Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

చేతులెత్తేసిన వైసీపీ సోషల్ మీడియా.. కారణం ఇదేనా?

గతంలో వైసీపీ అధినేత జగన్ ఏం చెప్తే అది నిజం, జగన్ ను ఎవరైనా ఏదైనా విమర్శిస్తే వెంటనే మాటల యుద్ధం, తల్లి లేదు చెల్లి లేదు… అబ్బ లేదు, ఎవరి మీద అయినా సరే మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మూగబోయింది. ఇప్పటి వరకు జగన్ ను నెత్తిన మోసిన ఎంతో మంది సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో పెయిడ్ పేజెస్ తప్పించి జగన్ కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. కారణం ఏంటో తెలియదు గాని, నాలుగు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా మౌనం పాటిస్తోంది.

తిరుమల లడ్డు వ్యవహారంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా మంది సైలెంట్ అయిపోయారు. ముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విమర్శించే ప్రయత్నం చేసినా సరే… తర్వాత 320 రూపాయలకు నెయ్యి ఎలా వస్తుంది అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. చాలా మంది నాయకులు జగన్ కు వ్యతిరేకంగా కూడా వైసీపీలోనే మాట్లాడారు. లడ్డూ నాణ్యత గురించి అవగాహన ఉన్న చాలా మంది జగన్ కు మద్దతు ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు. ఒక వర్గం మాత్రమే చంద్రబాబుని తిట్టే ప్రయత్నం చేసింది గాని… చాలా వరకు మౌనమే పాటించారు.

Read Also : బోల్తా కొట్టిన బీఆర్ఎస్ పెద్దలు

ఇక జగన్ ప్రెస్ మీట్ ని కూడా పెద్దగా వైసీపీ సోషల్ మీడియా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఇంగ్లీష్ చదవడం, సూపర్ స్వామి అనడం ఇలా తప్పులు ఉండటంతో పెద్దగా వైరల్ చేసే అంశాలు వైసీపీ సోషల్ మీడియాకు దొరకలేదు. ఇక వైసీపీ నాయకత్వం కూడా మౌనమే పాటించింది. చివరికి చిత్తూరు జిల్లా నేతలు కూడా ఈ విషయంలో సైలెంట్ అయ్యారు. సాక్షి ఛానల్ లో జగన్ ప్రచారం మినహా పెద్దగా వైసీపీ సోషల్ మీడియా నుంచి స్పందన లేదు. దేశ వ్యాప్తంగా జగన్ ను దోషిగా చూడటంతో వైసీపీ సోషల్ మీడియా వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్