Saturday, September 13, 2025 03:13 AM
Saturday, September 13, 2025 03:13 AM
roots

అతి చేయొద్దు.. అధికారుల పై బాబు ఆగ్రహం

గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు అప్పటి ముఖ్యమంత్రిని బుట్టలో వేసుకోవడానికి అనవసర హడావుడి చేసేవారు. ఇక ఆయనకు ప్రాణ భయం ఉండటంతో ఎక్కడికి వెళ్ళినా పట్టాలు కట్టి కాపాడుకునేవారు. సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు అధికారులు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరదాలు కట్టే అలవాటు మాత్రం వదులుకోవడం లేదు. ఈ మధ్య చంద్రబాబు పలు సందర్భాల్లో సీరియస్ కావడంతో పట్టాలు కట్టడం ఆగింది.

అయితే చంద్రబాబు వెళ్తున్నారు అంటే హడావుడి మాత్రం ఎక్కువగానే చేస్తున్నారు. తాజాగా వరద బాధితుల పరామర్శకు చంద్రబాబు వెళ్ళిన సమయంలో అధికారులు ఏకంగా పూలు కట్టి స్వాగతం చెప్పారు. దీనిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. కొల్లేరు ముంపు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సిఎం చంద్రబాబు… కైకలూరు ప్రాంతంలో మునిగిన పంటపొలాలను సైతం చూసారు. అనంతరం ఏలూరులో క్షేత్రస్థాయి పర్యటన చేసిన సిఎం…తమ్మలేరు బ్రిడ్జి వద్ద వరద తీవ్రతను పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Read Also : ఏపీకి వరుసగా కేంద్ర బృందాలు.. బాబు ఒత్తిడే కారణమా?

ఇక సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో అధికారులు, వరద బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి… తీసుకోవాల్సిన చర్యలపై ఒక స్పష్టత ఇచ్చారు. కాలేజ్ ఆడిటోరియంకు జిల్లా అధికారులు పూలతో అలంకరణ చేయడంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలపై సమీక్షలకు అలంకరణలు ఏంటని అధికారులను ప్రశ్నించారు. తన పర్యటనలకు హంగులు, హడావుడి వద్దు అని ఎన్ని సార్లు చెప్పినా యంత్రాంగం అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. సాధ్యమైనంత సింపుల్ గా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలనే తన ఆలోచనను అధికారులు తప్పక ఆచరించాలని చంద్రబాబు స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్