Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

బ్యారేజ్ ను బొట్లు ‘ఢీ కొట్టడం’ కుట్రే.. తేల్చేసిన బెజవాడ పోలీసులు

ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలిసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పలు కీలక విషయాలను రాబట్టారు. సూరాయిపాలెం కు చెందిన రామ్మోహన్, గొల్లపూడి కి చెందిన ఉషాద్రి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నేడు వన్ టౌన్ పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 40-50 టన్నుల బరువున్న బోట్లు.. బ్యారేజిని ఢీ కొట్టినట్టు గుర్తించారు. పడవల యజమానులు గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రి, సుధీర్, స్వామిగా గుర్తించిన పోలీసులు.. మూడు పడవలు గొల్లపూడి కి చెందిన వక్కల గడ్డ ఉషాద్రి పేరు పై రిజిస్ట్రేషన్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. మరో రెండు పడవలు సుధీర్, స్వామి పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయని తేల్చారు. మొత్తం అయిదు పడవలు గేట్లను ఢీకొట్టగా.. అందులో మూడు ఉషాద్రివే అని తేల్చారు.

Read Also : జగన్ 8 ప్రశ్నలకు టీడీపీ దిమ్మదిరిగే కౌంటర్

నిందితులు రామ్మోహన్, ఉషాద్రి కి వైసిపి నాయకులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం ఐదుగురుపై కేసుల నమోదు చేసారు. పక్కా ప్లాన్ ప్రకారమే.. గుంటూరు జిల్లా ఉద్దండరాయిపాలెం నుంచి పడవలను గొల్లపూడి తరలించారు. పడవలు గొల్లపుడికి రావటం, పడవలకు వైసిపి రంగులు వేసి ఉండటంపై అనుమానాలు రావడంతో… ఆ దిశగా పోలీసులు ఫోకస్ చేసారు. నిందితుల కాల్ డేటాతో పాటు, గూగుల్ టేకవుట్ వివరాల్ని కూడా పోలీసులు సేకరించారు. 125, 326B సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్