ఎట్టకేలకు నట సింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు… మోక్షజ్ఞ తేజ సినీ రంగ ప్రవేశం ఖరారు అయింది. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఒక లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. మోక్షజ్ఞ సినిమా విషయంలో బాలకృష్ణ చాలా పక్కా ప్లాన్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ లాంటి యువ దర్శకుడికి బాలయ్య… మోక్షజ్ఞ ను లాంచ్ చేసే బాధ్యతలు అప్పగించడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పురాణ కథలపై ఆసక్తి చూపించే బాలకృష్ణ… ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలో అదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ పక్కాగా సిద్ధం అయిన తరువాతనే రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ వినిపించిన కథ బాలయ్యకు బాగా నచ్చడంతో మోక్షజ్ఞ తో ఫోటో షూట్ కూడా చేయించారు. అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అయితే మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తగా ఉన్నారట. చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ జరగని స్థాయిలో లాంచ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.
Read Also :నోరు విప్పిన నందిగం సురేష్.. ఆందోళనలో వైసీపీ కీలక నేతలు
మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ చాలా బలమైన స్టోరీ రెడీ చేసారట. దాదాపు 400 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దానికి ముఖ్య కారణం అభిమానులతో పాటు కథలో మంచి విషయం ఉందన్న నమ్మకంతో బాలయ్య బడ్జెట్ కూడా భారీగానే ప్లాన్ చేసినట్టు టాక్. కథ పైన బాలకృష్ణ కుటుంబానికి మంచి నమ్మకం ఉందని, ఈ కథ విషయంలో దాదాపు రెండు నెలల నుంచి వర్క్ చేస్తున్నారని కూడా టాక్. ఇది సోషియో ఫాంటసీ చిత్రం కాబోతుంది. హనుమాన్ చిత్రం సాధించిన మంచి విజయంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ సినిమాపై మంచి జోష్ తో వర్క్ చేస్తున్నాడు.
బయటివారైతే సినిమా క్వాలిటీ విషయంలో రాజీపడే అవకాశం ఉండటంతో.. సోదరే రంగంలోకి దిగి సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి సినిమా పై బాలయ్య కుటుంబానికి ఎంత నమ్మకం ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు సినీరంగంలో ఎవరికీ జరగని విధంగా మోక్షజ్ఞ కి లాంచింగ్ జరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తెలుగు సినీ రంగంలో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన డెబ్యూ సినిమా అవ్వొచ్చు అని సమాచారం అందుతుంది.