Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

భూమన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?

వైసీపీ నేతల్లో… రెడ్డి సామాజిక వర్గ నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. చాలా మంది రెడ్డి సామాజిక వర్గ నేతలు గత అయిదేళ్ళలో చాలా మంచి పదవులు అనుభవించారు, చాలా బాగా సంపాదించుకున్నారు. వైసీపీలో తమకు పట్టున్న విషయాన్ని గ్రహించిన నాయకులు… ఏ అవకాశాన్ని కూడా వదలకుండా సంపాదించుకున్నారు. అందులో భూమన కరుణాకర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఆయన చేసిన అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవుడ్ని కూడా అడ్డం పెట్టుకుని ఆయన అక్రమాలు చేసారు.

తిరుపతి దేవస్థానం బోర్డ్ ని తన గుప్పిట్లో పెట్టుకుని భూమన సంపాదించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు భూమన సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎందుకు కనపడటం లేదు ఏంటీ అనేది ఇప్పుడు వైసీపీ నేతలకు కూడా అర్ధం కావడం లేదు. ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు మాట్లాడిన ఆయన కుమారుడు కూడా సైలెంట్ అయ్యారు. తగ్గితే తప్పేం ఉందిలే అనుకున్నారో లేక లోపల వేస్తారేమో అనే భయంతో సైలెంట్ అయ్యారో గాని సైలెంట్ అయితే అయ్యారు.

దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. టిడీఆర్ బాండ్ల కుంభకోణంలో భూమన కుమారుడి హస్తం ఉందని సమాచారం. దీని మీద మంత్రి నారాయణ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి కారుమూరి హస్తం కూడా ఇందులో ఉందని ప్రభుత్వం భావించి అంతర్గత విచారణ మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న భూమన ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కార్యకర్తలకు కనీసం ధైర్యం చెప్పే కార్యక్రమం కూడా ఆయన చేయడం లేదు. ఈ కేసు విషయంలో విచారణ పూర్తి అయితే మా పరిస్థితి ఏంటీ అనే భావనలో వారు ఉన్నారు. అందుకే భూమన అభినయ్ రాష్ట్రంలో కూడా ఉండటం లేదని టాక్. ఎన్నికల తర్వాత తాడేపల్లి ఒక్కసారి కూడా భూమన వెళ్ళలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్