Saturday, September 13, 2025 07:17 PM
Saturday, September 13, 2025 07:17 PM
roots

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జునకు రేవంత్ భారీ షాక్

నిన్నటి వరకు హైదరాబాద్ లో మాత్రమే వినపడిన హైడ్రా పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది. ఎప్పుడు ఏ బిల్డింగ్ కూలుస్తారో అని అక్రమార్కులు కంగారు పడిపోతున్నారు. మన పార్టీ లేదు పక్క పార్టీ లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉండటంతో అసలు ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. హైదరాబాద్ ను కబ్జాల ముప్పు నుంచి విడిపించి వరద ముప్పు నుంచి కాపాడాలని రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కూడా కేసు పెట్టారు.

ఇక ఇప్పుడు కీలక అడుగు పడింది. నాగార్జున కు చెందిన ఒక ఫంక్షన్ హాల్ ని హైడ్రా అధికారులు ఏ హడావుడి లేకుండా కూల్చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా సైలెంట్ అయ్యాయి. ముఖ్యమంత్రులు ఏం మాట్లడకపోవడంతో అందరూ సైలెంట్ గానే గమనించారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూ వచ్చారు. అసెంబ్లీలో సైతం కూడా మాట్లాడి… కూల్చాల్సిందే, చెరువుని కాపాదాల్సిందే అన్నారు.

అప్పుడు మాట్లాడిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి… ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా కూల్చి వేయించారు. దీనితో ఇప్పుడు మరో వార్త చర్చల్లోకి వస్తోంది. ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ కు చెందిన లోటస్ పాండ్ కూడా అక్రమంగా కట్టిన భవనమే అనే ఆరోపణలు ఉన్నాయి. నాగమయ్య కుంటలో కట్టిన లోటస్ పాండ్ సంగతి ఏంటి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. తమ్మిడి చెరువులో మూడు ఎకరాలకు పైగా ఆక్రమించి కట్టిన ఫంక్షన్ హాల్ ని కూల్చేసిన అధికారులు… నాగమయ్య కుంటలో కట్టిన లోటస్ పాండ్ ను కూడా కూల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీనిపై నాగార్జున స్పందించారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు కూల్చడం చట్ట విరద్దమని, తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చారని, అంగుళం భూమి కూడా అక్రమణ లేకుండా ప్రభుత్వ భూమిలో కట్టిన భవనం అని ఎక్స్ లో పోస్ట్ చేసారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు నాగార్జున.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్