Friday, September 12, 2025 07:31 PM
Friday, September 12, 2025 07:31 PM
roots

కొడాలి నాని కి రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేసిన టిడిపి

ఇప్పుడు మాజీ మంత్రుల మీద కూటమి సర్కార్ గట్టిగానే గురి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్ధమవుతున్న విషయం. రాజకీయంగా వైసీపీ బలంగా ఉన్నప్పుడు రెచ్చిపోయిన వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల మీద చంద్రబాబు సర్కార్ గట్టిగానే గురి పెట్టింది. ఏ మాత్రం క్షమించేది లేదనే ధోరణితో ఇప్పుడు ఒక్కో వ్యవహారాన్ని బయటకు లాగుతున్నారు. పెద్దిరెడ్డి, కారుమూరి, జోగి ఇలా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వీళ్ళకు అక్రమాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు సిద్దమైంది.

ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నానీకి కూడా రిటర్న్ గిఫ్ట్ సిద్దం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గుడివాడలో ఆయన చేసిన అక్రమాలపై గురి పెట్టింది సర్కార్. భూ కబ్జాలను పెద్ద ఎత్తున చేయడమే కాకుండా విలువైన భూములను తక్కువ ధరకు బెదిరించి తీసుకున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. గడ్డం గ్యాంగ్ పేరుతో ప్రముఖ ఛానల్ లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టింది సర్కార్. అంతే కాకుండా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా రేషన్ బియ్యం విదేశాలకు తరలించడంలో కొడాలి నానీ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని త్వరలోనే సిఐడీకి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడతా అని ఆయన స్పష్టం చేసారు. దీని బట్టి చూస్తే కొడాలి నానీకి రిటర్న్ గిఫ్ట్ రెడీ అయినట్టు గానే తెలుస్తోంది. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఒక ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఎప్పుడు చర్యలకు సిద్దమవుతారు అనేది చూడాలి. ప్రజలకు పంచిన సెంటు భూమిలో కూడా కొడాలి నానీ అక్రమాలకు పాల్పడినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎక్కువ ధరకు భూములను ప్రభుత్వానికి అమ్మిన అంశంలో సర్కార్ గురి పెట్టింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్