Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

తెలంగాణ టిడిపి పై బాబు సంచలన నిర్ణయం

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటీ అనే దానిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. రాజకీయంగా ఇతర పార్టీలు దూకుడు పెంచుతున్నా, అధికారం కోసం ఏ మాత్రం బలం లేని బిజెపి లాంటి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం కాస్త వెనకాడుతోంది అన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. తెలంగాణాలో కార్యకర్తల అభిప్రాయాలను కూడా సరిగా తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక ఇదిలా ఉంచితే రాబోయే స్థానిక సంస్థలు, గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది క్లారిటీ రావడం లేదు.

అయితే శనివారం ట్రస్ట్ భవన్ కు వెళ్ళిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని పోటీలో నిలపాలని భావిస్తున్నారట చంద్రబాబు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా పార్టీని పోటీలో నిలిపే ఆలోచనలో ఉన్నారట ఆయన. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా మొదలుపెట్టారట. కార్పొరేటర్ అభ్యర్ధులను కూడా ఒక నెలలో ఎంపిక చేసేసి వాళ్ళను పని చేసుకునే విధంగా ప్రోత్సహించాలని భావిస్తున్నారట. కేవలం కాగితం పులులని కాకుండా క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులకే అవకాశం ఇవ్వాలని టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఎన్నికల్లో అవసరం అయ్యే ఆర్ధిక సహాయం పై అవకాశం పొందిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడి వారికి అవసరం అయిన వనరులు సమకూర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ కోసం నమ్మకంగా పని చేసిన వాళ్లకు త్వరలోనే పదవులు ఇవ్వడమే కాకుండా గ్రేటర్ ఎన్నికల్లో వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నారట చంద్రబాబు. మరి దీనిపై ఏం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి. ఏపీలో కూటమి కట్టిన టిడిపి, జనసేన, బిజెపి ఇక్కడ కూడా కూటమిగా పోటీ చేస్తాయా లేక ఎవరికీ వారే విడివిడిగా పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో తెలంగాణాలో టిడిపి బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్