ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులను, మార్చిన పేర్లను సరి చేసుకుంటూ అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పధకానికి లేక ప్రతి పనికి జగన్ తన తండ్రి పేరు లేక తన పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వాటికి పేర్లు మారుస్తూ బాబు సర్కార్ అడుగులు వేస్తుంది. తాజాగా రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టులకు పాత పేర్లనే పునరుద్దరిస్తూ జీ వో విడుదల విడుదల చేసింది. 2019 – 24 మద్య మార్చిన పేర్ల స్థానంలో 2014 – 19 లో ఉన్న పేర్లను పేర్కొంటూ జీ వో విడుదల చేసింది. వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్ కు గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ఫేజ్ -1, వరికపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా పునః నామకరణం చేసారు.
వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ గా పేరు మార్చారు. వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు వెలిగల్లు రిజర్వాయర్ గా పునరుద్ధరించారు. నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయర్ కు సర్వరాయ సాగర్ రిజర్వాయర్ గా మార్చారు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజీ కు నెల్లూరు బ్యారేజీ గా, మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజి కు సంగం బ్యారేజ్ గా పేరు మార్చారు. గొర్రెపాటి బుచ్చి అప్పారావ్ రిజర్వాయర్ కు తాటిపూడి రిజర్వాయర్ గా మారుస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
Also read : గతంలో చేసిన తప్పే మళ్ళీ చేస్తారా లోకేష్?
అనంత వెంకట రెడ్డి హంద్రీ నివా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టు కు హంద్రీ నీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టు గా పేరు పెట్టారు. డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ కు పరిటాల రవీంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా, బూచేపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండల మినీ రిజర్వాయర్ కు మొగలిగుండల మినీ రిజర్వాయర్ గా, రాకెట్ల నారాయణ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు రాకెట్ల ఆమిద్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా పునరుద్ధరిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ జీ ఓ విడుదల చేసారు. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.