ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎలా అయినా సరే బురద జల్లాలి అని గట్టి పట్టుదలగా ఉన్న వైసీపీ అనుకూల మీడియా… నిజాలు ఏంటీ, గత పాలనలో ఏం జరిగింది అనే విషయాలను మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా లేకుండా ఏ వార్తలు పడితే అవి ప్రచురిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ విషయంలో దాదాపుగా ఇదే జరిగిందని చెప్పాలి. గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లులను వాయిదా వేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఆరోగ్య శ్రీ సేవలను కూడా నిలిపివేసిన పరిస్థితి మనకి తెలిసిందే.
భారీగా బకాయిలు ఉండటంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం చేయడానికి నిరాకరిస్తుంటే సజ్జల వారితో మాట్లాడి మళ్ళీ వైద్య సేవలను మొదలుపెట్టించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఏపీ సర్కార్ పై బురద జల్లే కార్యక్రమానికి సిద్దమయ్యారు భారతీ రెడ్డి సారధ్యంలోని సాక్షి మీడియా. కూటమిపై బురద జల్లే క్రమంలో గత జగన్ సర్కార్ చేసిన తప్పులను సాక్షిలో ప్రముఖంగా ప్రచురించారు. వైసీపీ సర్కార్… 1600 కోట్ల బకాయిలను నిలిపివేస్తే అవి కూటమి సర్కార్ నిలిపి వేసింది అంటూ కథనం ప్రచురించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కూడా పూర్తి కాలేదు.
దీనితో 1600 కోట్ల బకాయిలు ఏ విధంగా ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అంటూ కథనం రాసారు. 50 రోజులకు 1600 కోట్లు అయితే వాటి లెక్కలను బయట పెట్టాలని కోరుతున్నారు. కాగా ఆరోగ్య శ్రీ బిల్లులను నిలిపివేస్తామని ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఆగస్ట్ 15 లోపు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని… ఆరోగ్య శాఖా మంత్రి వద్దకు వెళ్ళినా తమకు హామీ లభించలేదని లేఖలో ప్రస్తావించారు.
ఈ కథనం చూసిన ఎవరైనా తన భర్త ఎంత అసమర్డుడో చెప్తూ, జగన్ రెడ్డి పరువు తీసే విధంగా ఆరోగ్యశ్రీకి రూ.1600 కోట్లు బకాయిలు ఉన్నట్టు చెప్తూ కథనం భారతి రెడ్డి రాయించింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో నంబర్ 2 పొజిషన్ కోసం, ఒకరి రహస్యాలు ఒకరు బయట పెట్టుకుంటున్న సజ్జల రెడ్డి, సాయి రెడ్డి. దీనికొటోడు ఇప్పుడు ఈ కొత్త పంచాయితీ చూసి తల పట్టుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు.అయితే కేవలం చంద్రబాబు పై బురద చల్లాలని చూసి జగన్ పరువు తీశారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.