Friday, September 12, 2025 08:50 PM
Friday, September 12, 2025 08:50 PM
roots

బాబు వ్యూహానికి జగన్ ప్రతివ్యూహం.. ఎవరు సక్సెస్ అయ్యారంటే..!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైఎస్ జగన్ పేరు మళ్ళీ మార్మోగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు వైఎస్ జగన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రజల్లో బలంగా లేకపోవడంతో… ఆయన అన్ని విధాలుగా ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ చేయని వాటిని కూడా చేసారు అంటూ జగన్ ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. ఏకంగా తన పార్టీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ లో ధర్నాకు కూడా కూర్చున్నారు.

అదంతా ఒక వైపు అయితే ఇక్కడ తను అనుకున్నది జగన్ బాగా సక్సెస్ అయ్యారనే కామెంట్ వినపడుతుంది. అసలు ఏం అనుకున్నారు జగన్…? ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదు అనేది జగన్ మొదటి లక్ష్యం. అందుకే ముందు రోజు ఆయన హడావుడి చేసి ఢిల్లీ వెళ్ళారు. అలాగే విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం నుంచి మీడియా ను పక్కదారి పట్టించడం, అందులో కూడా జగన్ బాగా సక్సెస్ అయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విడుదల చేస్తున్న కొన్ని శ్వేత పత్రాలపై ఆయన చర్చ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

దాదాపు నాలుగు అంశాల మీద శ్వేత పత్రాలు విడుదల చేసినా కూడా అవి పెద్ద చర్చల్లో లేవు అనే చెప్పాలి. టీడీపీ అనుకూల మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని అసలు వాటి మీద చర్చలు నిర్వహించడం లేదు. జగన్ మీడియా సమావేశాలు బాగా పాపులర్ చేస్తున్నారు. ఆయన తప్పులు మాట్లాడిన వాటికి మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఇలా దాదాపు పది రోజుల నుంచి జగన్ సక్సెస్ అవుతూనే ఉన్నారు. అవి ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే మీడియా దృష్టి మొత్తం వాటిపైనే ఉంది అనే మాట వాస్తవం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్