Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

మోదీకి మంగళగిరి చేనేత కండువాతో లోకేష్ సత్కారం

యువనేత నారా లోకేష్ గత వారంరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ యువగళం సభలతో సమరభేరి మోగిస్తున్నారు. రాబోయే ఎన్నికలపై నిర్వహించాల్సిన పాత్రపై యువతను చైతన్యపరుస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో అనివార్యంగా మంగళగిరికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన మనసంతా మంగళగిరిలోనే ఉంటోంది. తాజాగా రాజమండ్రిలో జరిగిన ప్రధాని మోదీ సభలో ప్రధాని నరేంద్ర మోదీని మంగళగిరి చేనేత కండువాతో సత్కరించి చేనేతలపై తన ప్రేమను చాటుకున్నారు. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ప్రధాని మోడీతో కలిసి ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీకి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుకరించి మండగళగిరి కండువాతో సత్కరించారు. తమపై లోకేష్ చూపుతున్న అభిమానం, ప్రత్యేక శ్రద్ధకు మంగళగిరి చేనేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి చేనేతలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితమే సొంత నిధులతో వీవర్స్ శాలను ఏర్పాటు చేశారు. అక్కడ అధునాతన మగ్గాలపై చేనేతలకు శిక్షణ ఇవ్వడంతో పాటు టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని, మంగళగిరి వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మంగళగిరి చేనేతకు మళ్లీ గతవైభవం తేవాలన్న లక్ష్యంతో స్థానిక చేనేత కార్మికులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యికి లోపు ఉన్న చేనేత మగ్గాలను 5వేలకు పెంచడమే తన లక్ష్యమని ప్రకటించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కూడా తమవంతు కృషిచేస్తున్నారు.

మంగళగిరి చేనేత వస్త్రాలను ధరిస్తూ స్థానిక చేనేతలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి చేనేతలు తన ఆత్మబంధువులు అని చెప్పిన లోకేష్, కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ప్రతి నోటా వస్తున్న ఒకే ఒక మాట… మన మంగళగిరి… మన లోకేష్!

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్