ఇండియన్ ప్రీమియర్ లీగ్ రసవరత్తరంగా సాగుతోంది. అగ్ర శ్రేణి జట్లు అన్నీ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుండగా… ఒక్క ముంబై ఇండియన్స్ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతుంది. 5 సార్లు కప్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించడం పట్ల ముంబై జట్టులో ప్రతీ ఒక్కరు ఆగ్రహంగా ఉన్నారనే కామెంట్స్ వినపడుతున్నాయి. చివరికి ప్రత్యర్ధి జట్లు సైతం అతని విషయంలో సీరియస్ గానే ఉన్నాయి. కెప్టెన్సీ కోసం గుజరాత్ వెళ్లి మళ్ళీ అదే కెప్టెన్ పదవి కోసం ముంబైకి ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా.
వరుసగా మూడు మ్యాచుల్లో ముంబై దారుణంగా ఓడిపోయింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా ఐపిఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డ్ కూడా నమోదు అయింది. మొన్నటికి మొన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై దారుణంగా ఓడిపోయింది ముంబై. ఇవన్నీ పక్కన పెడితే హార్దిక్ పాండ్యా వ్యవహారశైలి కూడా ఇతర ఆటగాళ్లకు చికాకుగా మారింది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జట్టులో ఉన్న సహాయక సిబ్బంది కూడా అతని ప్రవర్తన విషయంలో ఇబ్బందిగానే ఉన్నారు అని డ్రెస్సింగ్ రూమ్ నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఈ నేపధ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
ముంబై నుంచి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ కోసం అతను ఆక్షన్ లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. అలాగే జస్ప్రీత్ భూమ్రా, సూర్య కుమార్ యాదవ్ కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ముంబై యాజమాన్యానికి ఇప్పటికే రోహిత్ శర్మ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. రోహిత్ శర్మకు చెన్నై లేదా తిరిగి హైదరాబాద్ కు ఆడాలనే కోరిక ఉందని, ఖచ్చితంగా బయటకు వస్తాడని అంటున్నారు. ఈ విషయంలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. అయితే ముంబై జట్టు యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్ గా తిరిగి బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే వారి విజ్ఞప్తిని సున్నితంగానే తిరస్కరించిన రోహిత్, తన భవిష్యత్ ప్రణాళికను వారికి కూడా తెలియచేసినట్లు తెలిసింది.