కడపలో.. జగన్‌కే.. లోకేష్ ఝలక్ ఇవ్వగలిగారా..? తాత ఎన్టీఆర్.. తండ్రి చంద్రబాబు సాధించలేనిది.. మంత్రి లోకేష్ సాధించగలిగారా..? ఈప్రశ్నలే ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. పప్పు అంటూ గోల చేశారు. గేలి చేశారు. చివరికి డీఎస్సీ అక్రమాలంటూ శాప్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సమయంలో కూడా “మజ్జిగలో పంచదార వేసుకుని తాగు.. తియ్యగ ఉంటుంది.” అని కూడా సెటైర్లు వేశారు. అన్ని భరించారు. సహించాడు.. సరైన సమయం వచ్చినపుడు.. తన తడాఖా చూపించాలని ఇన్నాళ్లు లోకేష్ మౌనం వహించారు. తాను పప్పును కాదు.. రాజకీయ ధురందరుడిని అని.. సమయం చూసి.. తిరిగి తేరుకోలేనంతగా.. జగన్ మోహన్ రెడ్డి కంచుకోటలనే బద్దలుకొట్టారు.
Also Read : సిక్కోలు వైసీపీకి షాక్.. పాపం ధర్మాన..!
ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఢీ కొట్టటం అంటే.. కొరివితో తలను గోక్కున్నట్లే అనేది రాజకీయాల్లో ఉన్న వారి అభిప్రాయం. అయితే.. కొండను ఢీ కొడితే పొట్టేలు తల పగులుతుందన్న సామెతను ఇప్పుడు వమ్ము చేశారు. పొట్టేలు కొండను ఢీ కొడితే.. కొండ కూడా పగులుతుందని రుజువు చేశారు. ఇక్కడ వైసీపీ అనే కొండను టీడీపీ అనే పొట్టేలు పగలగొట్టింది. ఇదే సీమ టీడీపీ నేతల్లో కావాల్సినంత ధైర్యాన్ని నింపింది. ఎన్టీఆర్, చంద్రబాబు వల్ల కాని పని.. లోకేష్ చేసి చూపించారు. 1989 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ కుటుంబానిదే పెత్తనం. వరుసగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి గెలిచారు. 1998 ఎన్నికల సమయంలో కడప పార్లమెంట్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అప్పటి వరకు 50 వేల ఓట్ల మెజారిటీ సాధించిన వైఎస్ఆర్.. 1998 ఎన్నికల్లో మాత్రం 5 వేలతో సరిపెట్టుకున్నారు.
కడప జిల్లాలో జగన్ మోహన్ రెడ్డిని నేరుగా ఏ ఒక్కరూ ఢీ కొట్టలేరని వైసీపీ నాయకుల నమ్మకం. వారి నమ్మకాన్ని వమ్ము చేసిన ఘనుడు మంత్రి లోకేష్. ఇప్పుడు వైసీపీ నేతలే కాదు.. రాజకీయ నాయకులందరు షాక్‌లో ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. కడప జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవులు, కౌన్సిలర్ పదవులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా తెర వెనుక నుంచి అసలు గ్రంధాన్ని సీఎం చంద్రబాబు నడిపించారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులు అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే. పప్పు గాడు అని ఎగతాళి చేసిన వైసీపీ నాయకులకు, వైసీపీ మాజీ మంత్రులకు దిమ్మ తిరిగే విధంగా.. అంతా తానై తెర వెనకుండి నడిపించింది ముమ్మాటికీ మంత్రి లోకేష్ మాత్రమే.
Also Read : బెజవాడలో దూకుడు పెంచిన ఏబీవీ..!
ఈ విషయం అనుభవంతో కానీ జగన్ రెడ్డికి తెలిసొచ్చినట్లుంది. ఆయన పప్పు గాడు కాదు, రాజకీయం పోటు గాడు అని.. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరని రుజువు చేశారు. పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబం, కడప జిల్లా అంటే వైసీపీ కంచుకోట అనే మాట ఇప్పుడు చెరిగిపోయింది.. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబ బాధితులు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు కూడా. కడప మాది అని చెప్పిన వైసీపీ నేతల నోళ్లు మూయించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఇచ్చారు. రాజకీయంగా జగన్ రెడ్డికే లోకేష్ షాక్ ఇచ్చారని టీడీపీ నేతలంతా సంబరపడుతున్నారు. నిజంగా ఇవన్నీ పొగడ్తలు కాదు.. తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు రాజకీయంగా సాధించలేని విజయాలను లోకేష్ సాధించారని టీడీపీ సీనియర్ల సైతం ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు. ఇకపై కడప అంటే వైసీపీ కంచుకోట కాదు.


