Sunday, October 18, 2026 07:10 AM
Sunday, October 18, 2026 07:10 AM

టీవీఎస్ జూపిటర్ స్పెక్ట్రల్ రేంజ్ లాంచ్..!

భారత ద్విచక్ర వాహన రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటైన ‘టీవీఎస్ జూపిటర్ 110’ సరికొత్త లగ్జరీ అవతారంలో మార్కెట్లోకి దూసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లు, వినూత్నమైన రంగులతో కూడిన ‘జూపిటర్ 110 డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ రేంజ్’ వేరియంట్‌ను టీవీఎస్ మోటార్ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ టాప్-ఎండ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను 89,825 రూపాయలుగా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. హోండా యాక్టివా 110 సీసీ సెగ్మెంట్‌కు గట్టి పోటీనిచ్చేలా ఈ కొత్త స్కూటర్‌ను రంగులు మారే సరికొత్త టెక్నాలజీతో డిజైన్ చేశారు.

Also Read : ఫైనల్ కష్టమేనా..? భారత్ కు టెస్ట్ ఛాంపియన్ షిప్ కష్టమే..!

ఈ సరికొత్త స్పెక్ట్రల్ సిరీస్‌లో ‘స్పెక్ట్రల్ బ్లూ’, ‘స్పెక్ట్రల్ కాపర్’ అనే 2 విభిన్నమైన డ్యూయల్-టోన్ రంగులను కంపెనీ ప్రవేశపెట్టింది. ‘స్పెక్ట్రల్ కలర్ టెక్నాలజీ’ ని ఉపయోగించి తయారు చేసిన ఈ సరికొత్త పెయింట్.. ఎండ లేదా వెలుతురు పడే కోణాన్ని బట్టి రంగులు మారే విజువల్ ఎఫెక్ట్‌ను అందిస్తుంది. బ్లూ వేరియంట్‌లో వైట్, బ్లూ, పర్పుల్ షేడ్స్ కనిపించగా.. కాపర్ వేరియంట్‌లో వైట్, కాపర్, పర్పుల్ షేడ్స్ సరికొత్త రూపాన్ని ఇస్తాయి. లుక్ పరంగా మరింత ప్రీమియంగా మార్చేందుకు బ్రౌన్ కలర్ సీటు, వెనుక కూర్చునే వారి కోసం ఇంటెగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్ సపోర్ట్, మరియు క్రోమ్ మిర్రర్లను కూడా జోడించారు.

Also Read : హెచ్ 1 బీ రద్దు యోచనలో ట్రంప్ సర్కార్

కేవలం రంగులే కాకుండా, ఈ స్పెక్ట్రల్ రేంజ్ స్కూటర్‌లో కొన్ని అత్యుత్తమ ఫీచర్లను కూడా అప్‌గ్రేడ్ చేశారు. 110 సీసీ స్కూటర్ల విభాగంలోనే మొట్టమొదటిసారిగా ఇందులో ‘సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్’ మరియు సరికొత్త యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్టును ఏర్పాటు చేశారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీ ద్వారా నావిగేషన్ అసిస్టెన్స్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫీచర్లు ఇందులో కొనసాగుతాయి. సీటు కింద 2 హెల్మెట్లు పట్టేంత 33 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, ఇది 113.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 7.9 బీహెచ్‌పీ పవర్ మరియు 9.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్