Friday, August 28, 2026 11:56 AM
Friday, August 28, 2026 11:56 AM

ఈరోజు రాశి ఫలితాలు (28-08-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం.. 28-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

—————————————

వృషభం

నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేయనుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.

—————————————

మిధునం

అన్నిరంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విబేధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకోడీగా సాగుతాయి.

—————————————

కర్కాటకం

అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి.

—————————————

సింహం

ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

—————————————

కన్య

విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది.

—————————————

తుల

పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.

—————————————

వృశ్చికం

దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

—————————————

ధనస్సు

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు.

—————————————

మకరం

బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

—————————————

కుంభం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రధ్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం.

—————————————

మీనం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాల గూర్చి చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

పోల్స్