Wednesday, October 22, 2025 11:14 PM
Wednesday, October 22, 2025 11:14 PM
roots

రంజీ మ్యాచ్ డుమ్మా కొట్టి KKR శిబిరంలో అయ్యర్.. అందుకే వేటు!

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై చర్చ ఇంకా కొనసాగుతోంది. కొందరేమో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తరఫున 500ల పైచిలుకు పరుగులు చేసిన అయ్యర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని.. కానీ అయ్యర్ విషయంలో కాస్త ఆలోచించాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఆడనందుకే అతడికి కాంట్రాక్టు నుంచి తప్పించారనే వార్తలు వచ్చినా.. అది కాకుండా మరో పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. కాగా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఆడిన శ్రేయస్ అయ్యర్.. పేలవ ప్రదర్శన చేశాడు. తొలి టెస్టులో 35, 13 పరుగులు చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. రెండో టెస్టులో 27, 29 పరుగులకు పరిమితమయ్యాడు. దీంతో ఈ సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఎందుకు చోటు కల్పించలేదో బీసీసీఐ కూడా వివరణ ఇవ్వకపోవడంతో.. ఫామ్‌లేమి కారణంగా జట్టు నుంచి తప్పించారని అంతా భావించారు.

ఇదే సమయంలో రంజీ ట్రోఫీ జరుగుతుండగా అందులో శ్రేయస్ అయ్యర్ ఆడతాడని బీసీసీఐ వర్గాలు భావించాయి. ఈ మేరకు అతడికి సూచనలు సైతం చేశాయి. కానీ ముంబై తరఫున రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు అయ్యర్ డుమ్మా కొట్టాడు. అదేమని అడిగితే ఫిట్‌నెస్ లేదని చెప్పుకొచ్చాడు. కానీ జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం.. అయ్యర్‌ ఫిట్‌గానే ఉన్నాడని తేల్చిచెప్పడంతో వివాదం ముదిరింది.

ఈ సమయంలోనే అయ్యర్ చేసిన ఓ పని అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేలా చేసిందట. రంజీ మ్యాచ్ ఆడమని బీసీసీఐ సూచనలను పెడచెవిన పెట్టిన అయ్యర్.. ఐపీఎల్‌లో తాను కెప్టెన్‌గా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నాడట. ఆ జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ చేశాడట. ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. అయ్యర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

కాగా బీసీసీఐ చర్యలతో బెంబేలెత్తిపోయిన అయ్యర్.. వెంటనే రంజీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు! తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఆడకపోవడం కంటే కూడా.. కోల్‌కతా నైట్ రైడర్స్ శిక్షణ శిబిరంలో చేరడమే బీసీసీఐకి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

పోల్స్