Monday, October 27, 2025 03:40 PM
Monday, October 27, 2025 03:40 PM
roots

ఆర్టీసీ బస్సు తప్పింది.. కావేరి బలైంది.. కర్నూలు ఘటనలో సినీ ఫక్కీ సీన్లు

కర్నూలు రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో ఇప్పుడు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. డ్రైవర్ల కారణంగానే ప్రమాదం జరిగిందని చాలామంది ముందు భావించినా.. ఆ తర్వాత ద్విచక్ర వాహనం కారణంగానే ఘోరం జరిగిందనేది క్లారిటీ వచ్చింది. అటు పోలీసులు కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎర్రి స్వామి అనే వ్యక్తి విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లిన ఎర్రి స్వామి శివశంకర్ కు ఫోన్ చేసి.. కర్నూలు బస్టాండ్ కు రావాలని అడిగాడు.

Also Read : సస్పెండ్ చేస్తే తిరువూరు వచ్చే దమ్ముందా..?

దీనితో శివశంకర్ రాత్రి సమయంలో కర్నూలు బస్టాండ్ వద్దకు వెళ్లి.. దగ్గరలో ఉన్న మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, ఓ బహిరంగ ప్రదేశంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే తాను తుగ్గలి మండలంలో వివాహానికి హాజరుకావాలని శివశంకర్ కు చెప్పడంతో.. ముందు బస్టాండ్ లో డ్రాప్ చేయాలని అనుకుని బయలుదేరగా.. ఆ తర్వాత మద్యం మత్తులో తాను డోన్ వరకు డ్రాప్ చేస్తానని చెప్పడంతో ఇద్దరు కలిసి పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టించుకున్నట్లు విచారణలో వెళ్లడైంది. ఈ క్రమంలో చిన్నటేకూరు వద్ద బండి హెడ్ లైట్ సరిగా కనపడకపోవడంతో డివైడర్ ను ఢీ కొట్టింది.

Also Read : పులివెందులకు కేంద్రం గుడ్ న్యూస్..!

ఆ సమయంలో శివశంకర్ ప్రాణాలు కోల్పోగా ఎర్రి స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. శివశంకర్ మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎర్రి స్వామి.. అతన్ని పక్కకు లాగాడు. ఇక రోడ్డుపై వాహనం ఉండటంతో వాహనాన్ని కూడా లాగే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. ముందు ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత మరోసారి వాహనాన్ని లాగే ప్రయత్నం చేయగా.. కావేరీ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఇక మంటలు తీవ్రతకు భయపడిన ఎర్రి స్వామి సైలెంట్ గా తనకేమీ తెలియదు అన్నట్లు శివశంకర్ జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి ఓ లారీలో.. డోన్ చేరుకుని అక్కడి నుంచి ఆటోలో ప్యాపిలి వెళ్లాడు. అయితే స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుంటే రోడ్డు ప్రమాదం విషయం బయట పడుతుందని భయంతో చికిత్స చేయించుకోకుండానే ఇంటికి చేరుకున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పోల్స్