Saturday, October 25, 2025 08:24 PM
Saturday, October 25, 2025 08:24 PM
roots

వరల్డ్ కప్‌కు మేం రెడీ.. రోకో క్లారిటీ..!

గత నాలుగు నెలల నుంచి భారత క్రికెట్లో ప్రధానంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి పదేపదే ఓ చర్చ జరుగుతోంది. వీళ్ళిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారా లేదా..? ఇద్దరికీ ఆస్ట్రేలియా పర్యటన చివరిది కానుందా..? దీనికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు క్లారిటీ ఇచ్చిన సరే సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రశ్నల హడావుడి ఆగలేదు. వీళ్ళిద్దరిని జట్టు నుంచి తప్పించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు వాటన్నిటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సమాధానం చెప్పారు.

Also Read : కొత్త రోహిత్ ను చూసిన ఫ్యాన్స్.. పంథా మార్చేశాడు..!

తమలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని విమర్శకులకు సమాధానం ఇచ్చారు. సిడ్నీలో జరిగిన చివరి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 69 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 168 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెరీర్లో 33వ సెంచరీ నమోదు చేయగా, కోహ్లీ 75వ ఆఫ్ సెంచరీ చేసాడు. తమలో జట్టు కోసం ఆడే సత్తా ఉందని నిరూపించారు. తమను టార్గెట్ చేస్తున్న సెలెక్టర్లకు రోహిత్ మాన్ అఫ్ ది సీరిస్ తో సమాధానమివ్వగా కోహ్లీ అర్థ సెంచరీ తో క్లారిటీ ఇచ్చేశాడు.

Also Read : రోహిత్ రికార్డుల మోత.. సిడ్నీలో రోకో షో అదుర్స్..!

ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ క్రికెట్ ఆస్ట్రేలియా కు, ఆస్ట్రేలియా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ఇద్దరు ఆటగాళ్లు. వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడతారా అనే ప్రశ్నకు ఇద్దరు సమాధానం ఇచ్చారు. తాము వన్డే క్రికెట్ ఆడాలనుకుంటున్నామని, క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నామని తెలిపారు. దీనితో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వచ్చే నెల 30 నుంచి సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ మొదలుకానుంది. ఆ తర్వాత వరుసగా వన్డే క్రికెట్ ఆడుతుంది భారత్. ఆ సీరిస్ లో కూడా ఇద్దరూ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ కూడా సెంచరీ చేసి ఉంటే బాగుండేదని కామెంట్స్ వస్తున్నాయి. కాగా ఈ సిరీస్ లో రోహిత్ మాన్ అఫ్ ది సీరిస్ గా నిలవడం గమనార్హం. అయితే సెలక్షన్ కమిటీలో మార్పులు చేయాలని అభిమానులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

తండ్రీ, కొడుకుల పర్యటనలు...

ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు గత రెండు...

పోల్స్