Saturday, October 25, 2025 08:24 PM
Saturday, October 25, 2025 08:24 PM
roots

రోహిత్ రికార్డుల మోత.. సిడ్నీలో రోకో షో అదుర్స్..!

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫుల్ జోష్ ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం రోజులు తరబడి ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించింది ఈ జోడి. తొలి రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ డక్ అవుట్ కాగా.. రోహిత్ శర్మ రెండో వన్డేలో అర్థ సెంచరీ సాధించాడు. ఇక రెండో వన్డేలో కూడా డకౌట్ కావడంతో విరాట్ కోహ్లీ పని అయిపోయింది అని విమర్శిస్తున్న వాళ్లకు.. మరోసారి తాను చేజ్ మాస్టర్ అని ప్రూవ్ చేశాడు.

Also Read : హైడ్రా కమీషనర్ రంగనాథ్ – పవన్‌ కళ్యాణ్ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?

ఇప్పటికే సీరిస్ కోల్పోయిన భారత్.. మూడో వన్డేలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అంచనాలకు మించి రాణించింది భారత జట్టు. మూడో వన్డేలో 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచి దూకుడుగా ఆడింది. 69 పరుగుల వద్ద కెప్టెన్ గిల్ 24 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ నిర్మించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ సెంచరీ చేయగా విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Also Read : బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి..?

38.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన వన్డే కెరీర్ లో 33వ శతకాన్ని నమోదు చేశాడు. అలాగే అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు రోహిత్. అలాగే ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఆస్ట్రేలియాపై మొత్తం 9 సెంచరీలు చేశాడు రోహిత్. కోహ్లీ 10 సెంచరీలు చేసి టాప్ లో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఇప్పటివరకు కోహ్లీ 5 సెంచరీలు చేసి టాప్ లో ఉండగా.. రోహిత్ 6వ సెంచరీ నమోదు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. సిరీస్ కోల్పోయినా సరే చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆట తీరుతో అభిమానులు పండగ చేసుకున్నారు. కాగా ఇద్దరు 168 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

తండ్రీ, కొడుకుల పర్యటనలు...

ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు గత రెండు...

పోల్స్