ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. గత 4 రోజుల్లో ఏకంగా 45 మందిని బదిలీ చేసింది ప్రభుత్వం. తాజాగా ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలువుతుందనే వార్తలు వచ్చిన దగ్గరి నుంచి అధికారుల బదిలీలు మొదలయ్యాయి. మొన్న 12 మంది కలెక్టర్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు బాధ్యతలు చేపడతారు.
Also Read : మెగా ఫ్యాన్స్ కు 18 ఇయర్స్ గిఫ్ట్ రెడీ
మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ అయ్యారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తుంది సర్కార్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనాను నియమించగా.. బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ కు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్లను నియమించారు. తిరుపతి జిల్లాకు ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడును నియమించింది ప్రభుత్వం. తొక్కిసలాట ఘటన తర్వాత సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీ గా తప్పించింది.
Also Read : రిటైర్మెంట్ ఆలోచనలో మరో ముగ్గురు స్టార్లు
సమర్ధ అధికారిగా పేరున్న ఆయనను మళ్ళీ తిరుపతిఎస్పీ గా బదిలీ చేసింది. ఇక ఉమ్మడి కడప జిల్లాలో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలిని నియమించిన సర్కార్ కడప జిల్లా ఎస్పీగా నచికేత్ కు బాధ్యతలు అప్పగించింది. నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు చేపడతారు. గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ ను పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్ రాజు.. చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్‌కుమార్ లను నియమించింది.