Friday, September 12, 2025 08:41 PM
Friday, September 12, 2025 08:41 PM
roots

ఎస్పీలపై చంద్రబాబు గురి..? కారణం అదేనా

ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. కొంతమంది అధికారులు సమర్ధవంతంగా పనిచేయకపోవడం, మరికొంతమంది అధికారులతో రాజకీయ నాయకులకు సమస్యలు రావడం.. సహా కొన్ని కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని బదిలీలు జరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు 30 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్ లో బదిలీ చేశారు. సోమవారం 11 మంది అధికారులను బదిలీ చేసింది ఏపీ సర్కార్.

Also Read : దసరా నవరాత్రులకు శరవేగంగా ఏర్పాట్లు.. అధికారుల పరిశీలన

అందులో ఎక్కువగా సీనియర్ ఐఏఎస్ అధికారులే ఉన్నారు. టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ బాబు వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది సర్కార్. ఇక గురువారం ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను కీలక స్థానాలకు బదిలీలు చేసింది. ఆ వెంటనే 12 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో మంత్రులతో విభేదాలు ఉన్న కలెక్టర్లు కూడా ఉన్నారు.

Also Read : వారసులు.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ..?

దాదాపు కలెక్టర్ల విషయంలో 20 రోజుల నుంచి కసరత్తు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందరూ ఊహించినట్టుగానే గురువారం సాయంత్రం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం మొదలైంది. కొంతమంది జిల్లా ఎస్పీలు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. అటు వైసీపీకి సహకరిస్తున్నారనే కారణంతో కూడా కొంతమంది అధికారులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే మూడు నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనితో జిల్లా ఎస్పీలను కలెక్టర్లను మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి కొంతమంది కలెక్టర్లను కూడా మార్చే అవకాశం ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక కీలక శాఖలో కూడా ఐఏఎస్ అధికారులతో పాటుగా పోలీస్ విభాగంలో ఐపీఎస్ అధికారుల మార్పు ఉండొచ్చని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్