Friday, September 12, 2025 08:51 PM
Friday, September 12, 2025 08:51 PM
roots

మళ్ళీ బ్యాట్ పట్టిన రోహిత్.. టార్గెట్ ఫిక్స్..?

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ కు దూరంగా ఉన్న రోహిత్.. మళ్లీ నెట్స్ లో కనిపించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో చివరిసారి కనబడిన రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో కనిపించాడు. ఆ మ్యాచ్ లో మేన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన రోహిత్ ఆ తర్వాత అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక అక్కడి నుంచి అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం గట్టిగా జరిగింది.

Also Read : అతనికి ఇప్పుడైనా ఛాన్స్ వస్తుందా..? గంభీర్ కరుణిస్తాడా..?

సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అభిమానులతో పాటుగా క్రికెట్ విశ్లేషకులు కూడా హడావుడి చేశారు. అయితే రోహిత్ మాత్రం వచ్చే వరల్డ్ కప్ వరకు క్రికెట్ ఆడాలని భావిస్తున్నట్లు తెలిసింది. అటు బోర్డు పెద్దలు కూడా అతను వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడని స్పష్టం చేశారు. ఈ తరుణంలో వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో రోహిత్ శర్మ ఆ సిరీస్ తర్వాత క్రికెట్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని మళ్ళీ ప్రచారం జరిగింది. ఈ వార్తల నడుమ రోహిత్ మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు.

Also Read : మెడికల్ కాలేజీల వార్.. అసలు నిజాలేమిటో..?

నెట్స్ లో దాదాపు ఆరు గంటలపాటు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ పర్యవేక్షణలో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రోహిత్. ఆస్ట్రేలియా పర్యటనలో రాణిస్తే ఖచ్చితంగా వచ్చే వరల్డ్ కప్ వరకు తనపై ఒత్తిడి ఉండదు అనే భావనలో రోహిత్ ఉన్నట్లు సమాచారం. గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో రోహిత్ రాణించకపోవడంతోనే అతనిపై విమర్శలు పెరిగాయి. ఇప్పుడు రాబోయే సిరీస్ లో రాణించి ఆ విమర్శలకు చెక్ పెట్టాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్