Saturday, September 19, 2026 10:33 PM
Saturday, September 19, 2026 10:33 PM

ఇదేం ప్రెస్ మీట్ అన్న..? షాక్ అవుతున్న జర్నలిస్ట్ లు

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం, విలేఖర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాలపై విమర్శలు చేయడానికి మీడియాను ఎక్కువగా వాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ వ్యవహారశైలి దీనికి చాలా భిన్నంగా ఉంది. 2019 కు ముందు మీడియాతో ఎంతో స్వేచ్చగా మాట్లాడిన జగన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు.

Also Read : వైసీపీకీ టీడీపీ భరోసా..!

రాసి ఇచ్చిన వాటినే ప్రసంగించడం మాత్రమే జగన్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే జరుగుతోంది. సాధారణంగా మీడియా సమావేశాల్లో విలేఖర్లు అడిగే ప్రశ్నలు ఉంటాయి. కాని జగన్ సమావేశంలో రాసి ఇచ్చిన ప్రసంగం చదవడం మాత్రమే ఉంటుంది. తాను తిట్టాలి అనుకున్నవి తిట్టడం ఒకటి అయితే, జగన్ ను ప్రశ్నలు అడిగే జర్నలిస్ట్ లు ఒక్కరు కూడా మీడియాలో కనపడకపోవడం గమనార్హం. అసలు ఏ ఛానల్ ప్రతినిధులు ఉన్నారో కూడా ఎవరికి అర్ధం కాని పరిస్థితి.

Also Read : లోకేష్ అదుర్స్.. వార్ రూమ్ లోనే మంత్రులు

ఇక మీడియా సమావేశానికి జర్నలిస్ట్ లను ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. కానీ, జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ఓ లైవ్ లింక్ ను ముందుగా పంపిస్తారు. స్థానిక జర్నలిస్ట్ లకు గాని వేరే ఏ ఒక్కరికి సమాచారం ఉండదు. వైసీపీ అనుకూల మీడియాలో ఆ లింక్ ప్లే కావడం చూస్తూనే ఉంటాం. తాజాగా జరిగిన మీడియా సమావేశం కూడా దాదాపుగా అలాగే ఉంది. ఇక ఆ వీడియో కూడా వైసీపీ కార్యకర్తలకు బిట్ లు గా కట్ చేసి పంపించడం వంటివి జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్