ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి పాత్ర కాస్త భిన్నం. ఓ జర్నలిస్ట్ పార్టీలో నెంబర్ 2 గా మారడం ఆశ్చర్యం అయితే, వైసీపీ లాంటి పార్టీలో జగన్ ను మించి ప్రభావం చూపించడం మరింత విడ్డూరం అనే చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన వ్యవహారం ఎప్పుడూ ఆ పార్టీలో సంచలనమే. జగన్ ఓటమికి ఆయనే కారణం అనే విమర్శలు సైతం ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు ఎన్నో సందర్భాల్లో సజ్జలపై విమర్శలు చేసారు. అయినా సరే జగన్ మాత్రం ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.
Also Read : రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఇవే లెక్కలు..
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. లిక్కర్ కేసు విషయంలో సజ్జలకు వైఎస్ జగన్ కు విభేదాలు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డుకునే విషయంలో సజ్జల విఫలం అయ్యారనే కోపం జగన్ లో ఉందట. విజయసాయి రెడ్డి తనకు దూరం కావడానికి సజ్జల ప్రధాన కారణమని, విజయసాయి ఉండి ఉంటే.. లిక్కర్ కేసు తీవ్రమయ్యే అవకాశం ఉండకపోవచ్చని సన్నిహితుల వద్ద జగన్ కామెంట్ చేసినట్టు సమాచారం.
Also Read : అవును.. వాళ్లు మాత్రమే వస్తారు..!
అలాగే కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేందుకు న్యాయ వ్యవహారాలను చూసుకున్న సజ్జల, లాయర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహారించలేదు అని జగన్ అసహనం వ్యక్తం చేసారట. మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ముందు నుంచి సమాచారం ఉన్నా సరే.. కాపాడలేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. జగన్ వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై పెద్దిరెడ్డి.. బెంగళూరు వెళ్లి జగన్ తో కూడా భేటీ అయ్యారట. లిక్కర్ కేసులో పార్టీపై విమర్శలు వచ్చినా సరే సజ్జల.. కీలక పదవిలో ఉండి కూడా టీడీపీ విమర్శలకు, ప్రభుత్వ చర్యలకు మీడియా ముఖంగా సమాధానం ఇవ్వలేదనే అసహనం కూడా జగన్ లో ఉన్నట్టు సమాచారం. ఇక పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడకుండా సజ్జల అడ్డుకున్నారనే విమర్శలు సైతం పార్టీలో వినపడుతున్నాయి.




