రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. భారత రాష్ట్ర సమితిలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీకి హరీష్ రావు రాజీనామా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కవిత హరీష్ రావును టార్గెట్ చేయడంతో.. భారత రాష్ట్ర సమితి నేతలు కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. దీని వెనక కీలక వ్యక్తుల ప్రమేయం ఉండి ఉండవచ్చు అనే ప్రచారం సైతం జరుగుతోంది. కవిత చేసిన వ్యాఖ్యలు హరీష్ రావు తేలికగా తీసుకోలేదు అనే అభిప్రాయం బలంగా వినపడుతోంది.
Also Read : రెడ్ బుక్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!
దీనితో ఆయనను బుజ్జగించేందుకు కెసిఆర్, కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పై కూడా విమర్శలు చేశారు కవిత. దాదాపు నాలుగు రోజుల నుంచి హరీష్ రావు సైలెంట్ గానే ఉన్నారు. ఆయన శనివారం లేదా ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం ఉంది. దీనితో కెసిఆర్.. హరీష్ రావును.. తన ఫామ్ హౌస్ కి పిలిచారు. ఇప్పటికే పార్టీలో పరిస్థితులపై కేసీఆర్.. కేటీఆర్ ను అడిగి పలు వివరాలు కూడా తెలుసుకున్నారు.
Also Read : ప్రజల నిర్ణయమే ఫైనల్..!
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బయటకు రాని కెసిఆర్.. త్వరలోనే బయటికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారంటూ కూడా మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నేడు.. కేటీఆర్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత వీరితో హరీష్ రావు కలిసే అవకాశం ఉంది. అయితే కవితను కూడా పిలిచి ముందు కేసీఆర్ మాట్లాడదాం అని భావించారు. కానీ కవిత రాను అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని దానికి అడ్డుకట్ట వేయడానికే… ఈ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.