2024లో వైసీపీ ఓటమి తర్వాత వైయస్ కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ఆ పార్టీ కార్యకర్తలను కుటుంబ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తుల విషయంలో.. వైయస్ జగన్, వైయస్ షర్మిల మధ్య జరుగుతున్న పరిణామాలు వైఎస్ విజయమ్మను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా వైసీపీకి దూరమైన విజయమ్మ ప్రస్తుతం షర్మిల కు దగ్గరగా ఉన్నారు. అటు విజయమ్మ పై కూడా జగన్ కోర్టులో కేసులు వేశారు. జగన్ పై విజయమ్మ న్యాయపోరాటానికి దిగారు.
Also Read : ట్రంప్ తో ఏం మాట్లాడానో.. మోడీకి చెప్పా.. పుతిన్ కామెంట్స్
ఆస్తుల్ని ఎన్సిఎల్టి లో కేసు వేసి లాక్కోవడంపై న్యాయపోరాటం చేసేందుకు విజయమ్మ సిద్ధమయ్యారు. హైదరాబాద్ ఎన్సీఎల్టీ కోర్టు ఇచ్చిన తీర్పు.. దారుణంగా ఉందని, అధికారం లేకపోయినా తీర్పు ఇచ్చారని చెప్పి, చెన్నై ట్రిబ్యునల్ ను విజయమ్మ ఆశ్రయించారు. సరస్వతి పవర్ సిమెంట్స్ వ్యవహారాలన్నీ చట్టబద్ధంగా జరిగినట్లు విజయమ్మ పేర్కొన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత కుటుంబ వివాదాన్ని జగన్ రెడ్డి ఎన్సీఎల్టీ కి తీసుకువస్తే సంబంధం లేకపోయినా సరే విచారించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని విజయమ్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
Also Read : కర్మ సిద్ధాంతం.. వైరల్ అవుతోన్న రేవంత్ కామెంట్స్
సరస్వతి పవర్ కంపెనీ విషయంలో జగన్, భారతి.. విజయమ్మకు గిఫ్ట్ డిడ్ కింద రాసి ఇచ్చిన సంగతి తెలిసిందే. విజయమ్మ షర్మిల కు మద్దతు ఇవ్వటంతో ఆమె నుంచి తమ ఆస్తులను వెనక్కి తీసుకుంటామని ఎన్సిఎల్టిని ఆశ్రయించారు జగన్ దంపతులు. తల్లి అక్రమంగా ఆస్తులు లాక్ ఉంటుందని వాదించి ఎన్సీఎల్టీ నుంచి అనుకూల ఉత్తర్వులు జగన్ తెచ్చుకోవడం సంచలనమైంది. తల్లికి ఆస్తి ఇవ్వకూడదని జగన్ కోర్టుకు వెళ్లడం పై రాజకీయ ప్రత్యర్థులు కూడా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనకు అన్యాయం జరిగిందని విజయమ్మ పిటీషన్ దాఖలు చేశారు.