Friday, September 12, 2025 08:26 AM
Friday, September 12, 2025 08:26 AM
roots

అసలు విషయం మర్చిపోయారా సార్..!

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ బాపు అని చెప్పుకునే కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరికి తెలంగాణ ఉద్యమంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి ఆధిపత్య పోరు చేరుకుంది. చివరికి త్వరలోనే కొత్త పార్టీ పెట్టే దిశగా కవిత ప్లాన్ చేస్తున్నారనే మాట ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.

Also Read : లండన్ లో కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్.. షాక్ అయిన ఫ్యాన్స్

తెలంగాణ అంటే.. మాదే అని గొప్పగా చెప్పుకున్నారు భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు. తెలంగాణ కోసం పార్టీ అధినేత కేసీఆర్ పోరాటం చేశారని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆయన వల్లే సాధ్యమైందని గొప్పగా చెబుతున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు సహకరించారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు.. ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైందనేది బహిరంగ రహస్యం. తొలుత కేటీఆర్, హరీష్ రావు మధ్య పార్టీ కోసం కుమ్ములాట జరిగింది. ఒకదశలో కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ప్రచారం కూడా నడిచింది. కానీ.. ఈ ప్రచారానికి కేసీఆర్ గండి కొట్టారు. అయితే పార్టీ పగ్గాలు మాత్రం కేటీఆర్‌కు అప్పగించారు కేసీఆర్.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రధానంగా ఆరోపణ చేసింది. ఆ తర్వాత ప్రత్యేకంగా విచారణ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత సీబీఐకి కేసు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కవిత.. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు అవినీతికి కారణం వాళ్లిద్దరే అని ఆరోపించారు.

Also Read : ఐఫోన్ 17 రేట్స్ ఇవేనా..? ప్లస్ మోడల్ కు గుడ్ బై..!

కవిత వ్యాఖ్యలపై పార్టీ ఎలాంటి వివరణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. పైగా కవిత పార్టీ లైన్ దాటారంటూ సస్పెండ్ చేశారు. ఇక్కడే అసలు విషయం మర్చిపోయారనే మాట వినిపిస్తోంది. కవిత తప్పుడు ఆరోపణలు చేశారనే మాట పార్టీ నేతలు చెప్పటం లేదు. పైగా.. కవిత వ్యాఖ్యలకు బలమించేలా.. ఆమె పైనే తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ అవినీతి చేసినట్లు హరీష్ రావు ఒప్పుకుంటున్నారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్