Monday, October 27, 2025 07:57 PM
Monday, October 27, 2025 07:57 PM
roots

రష్యా భారీ డిస్కౌంట్.. అమెరికాకు భారత్ షాక్..!

రష్యాపై తనకు ఉన్న కోపాన్ని భారత్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తీసుకున్న నిర్ణయాలు అమెరికాకు ఎదురు దెబ్బ తగిలే మాదిరిగా ఉన్నాయి. రష్యాతో భారత్ చమురు వాణిజ్యాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని సుంకాలు విధించారు ట్రంప్. దీనితో రష్యా.. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకుంటుంది. భారీ డిస్కౌంట్ లు ఇచ్చేందుకు సిద్దమైంది. దీనితో భారత్ మరింత చమురును రష్యా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో దిగుమతి మరింత పెరగనుంది.

Also Read : హరీష్ పై బాంబులు పేల్చిన కవిత.. మా అన్నను ఓడించడానికి కుట్ర చేసాడు..!

సెప్టెంబర్ చివరి, అక్టోబర్ నెలల్లో బ్రెంట్ కంటే బ్యారెల్ కంటే 3 నుండి 4 తక్కువ ధరకు రష్యా ముడి చమురు భారత్ కు అందించడానికి సిద్దమైనట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కొన్ని వారాల క్రితం ఇది 2 డాలర్లుగా ఉండగా జులైలో కేవలం ఒక్క డాలర్ మాత్రమే. బ్లూమ్‌ బెర్గ్ నివేదిక ప్రకారం, అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన వెంటనే ఆగస్టు 27, సెప్టెంబర్ 1 మధ్య భారత్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ శుద్ధి కర్మాగారాలు 11.4 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి.

Also Read : బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా దేవినేని వారసుడు..?

ఆగస్టు ప్రారంభంలో స్వల్ప విరామం ఉన్నప్పటికీ, భారత శుద్ధి కర్మాగారాలు రష్యన్ చమురును కొనడం కొనసాగించాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇక్కడి నుంచి మరింత చమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉండవచ్చు. ఆగస్టు నుండి సెప్టెంబర్‌ లో రష్యన్ చమురు కొనుగోళ్లను 10 శాతం నుండి 20 శాతం లేదా రోజుకు 1,50,000 నుండి 3,00,000 బ్యారెళ్ల వరకు పెంచాలని భారత శుద్ధి కర్మాగారాలు యోచిస్తున్నాయని తెలిపింది. ఇది అక్టోబర్ కు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్