సాధారణంగా అధికారంలో ఉన్నప్పటి కంటే అధికారం లేని సమయంలో రాజకీయ నాయకులకు పార్టీ కార్యకర్తలను కలవడానికి సమయం ఎక్కువగా దొరుకుతుంది. ముఖ్యంగా పార్టీ అధినేతలకు ఈ విషయంలో ఎటువంటి షరతులు గానీ సమస్యలు గానీ ఉండవు. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో.. కార్యకర్తలను ప్రజలను నేరుగా కలవడం అనేది కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో నాయకుల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం వంటివి చేస్తూ ఉండాలి. కానీ ఈ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు.
Also Read : అంతా హారీష్ డ్రామా.. మా నాన్న పరువు తీసాడు.. కవిత సంచలనం
2024 లో అధికారం కోల్పోయిన తర్వాత కనీసం కడప జిల్లా నాయకులకు కూడా ఆయన అందుబాటులో ఉండటం లేదు. తాజాగా కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్ పులివెందులకు మాత్రమే పరిమితమయ్యారు. జిల్లా నాయకులను కూడా కలవడానికి ఆసక్తి చూపించలేదు. తనను ఎవరైనా కలవాలి అంటే వారికి పాసులు జారీ చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పిన వారు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వారి సమస్యలను వినేందుకు ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. కేవలం తనను కలవడానికి వచ్చిన నాయకులను ఫోటో దిగి పంపిస్తున్నారు జగన్.
Also Read : అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్..? రామచంద్ర యాదవ్ పై విమర్శలు
అలాగే పులివెందుల నియోజకవర్గంలో గ్రామస్థాయి నాయకులతో ఎమ్మెల్యే హోదాలో జగన్ మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడటానికి వచ్చిన సరే అక్కడున్న నాయకులు జగన్ వద్దకు పంపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో జగన్ నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి కావాల్సిన సమయం ఉన్నా సరే జగన్ మాత్రం.. నియోజకవర్గ నాయకులను కలవడం లేదు. ఇటీవల పులివెందుల జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థితో కూడా జగన్ మాట్లాడకపోవడం ఆశ్చర్యపరిచింది. జగన్ ను కలవడానికి వచ్చిన హేమంత్ రెడ్డి వెనక్కు తిరిగి వెళ్లిపోయారట.