Friday, September 12, 2025 08:20 AM
Friday, September 12, 2025 08:20 AM
roots

అంతా మేమే.. మొత్తం మాకే..!

రాజకీయాల్లో వారసులు రావడం సర్వ సాధారణం. ఇప్పటికే అన్ని పార్టీల్లో ఈ వారసత్వ రాజకీయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వారసుడు నారా లోకేష్‌ ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గాంధీ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా వారసులే రాజ్యమేలుతున్నారు. ఇక వైసీపీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2009లో కడప ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత వైసీపీ స్థాపించారు జగన్. ఇక వైసీపీలో ఉన్న ముఖ్య నేతల వారసులే ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు.

Also Read : అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్..? రామచంద్ర యాదవ్ పై విమర్శలు

సజ్జల, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, బొత్స, తమ్మినేని, పేర్ని, పిల్లి, జక్కంపూడి, ధర్మాన.. ఇలా ప్రతి ఒక్కరి వారసులు రాజకీయాల్లో ఉన్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పేర్ని, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనూహ్యంగా తనకు బదులుగా కుమారుడు మోహిత్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపారు. భాస్కర్ రెడ్డి మాత్రం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కూటమి ప్రభావంతో పాటు వైసీపీపైన వ్యతిరేకత వల్ల మోహిత్, భాస్కర్ రెడ్డి ఓడిపోయారు.

వాస్తవానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం భాస్కర్ రెడ్డి. ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచినప్పటికీ.. నియోజకవర్గానికి ఏమీ చేయలేదనే మాట బాగా వినిపిస్తోంది. అదే సమయంలో కార్యకర్తలను కనీసం పట్టించుకోలేదని.. ఎంతసేపు స్వలాభాన్ని మాత్రమే చూసుకున్నారనే అపవాదు ఉంది. మరోవైపు సొంత టీమ్‌తో సర్వేలు చేయించుకుంటారు తప్ప.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదనేది చంద్రగిరిలో వినిపిస్తున్న మాట. ఇక వీటన్నిటికీ తోడు.. ఇప్పుడు లిక్కర్‌ కేసులో అరెస్టు కూడా అయ్యారు. ఏ తప్పు చేయకపోతే బెంగళూరు నుంచి కొలంబో ఎందుకు పారిపోతున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.

Also Read : అత్యంత గోప్యంగా అర్ధరాత్రి.. రేవంత్ ను తక్కువ అంచనా వేసారా..?

ఇక ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం చెవిరెడ్డిని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికీ తగిన గుణపాఠం చెబుతామంటున్నారు ఆయన అభిమానులు. అదే సమయంలో 2029 ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని… తిరుపతి రూరల్ నియోజకవర్గం నుంచి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారని.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భాస్కర్ రెడ్డి చిన్న కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి లేదా భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ పోటీ చేసి గెలుస్తారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒకరిని గెలిపించే తప్పు చేశాం.. ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు, నలుగురు పోటీ చేస్తారా.. వామ్మో అంటున్నారు నెటిజన్లు. ఇక చంద్రగిరి వాసులు అయితే.. ఎన్నికల్లో పోటీ చేసే ముందు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను కనీసం పట్టించుకోలేదంటున్నారు. దీంతో ఇలాంటి ప్రచారం వల్ల వచ్చే నాలుగు ఓట్లు కూడా రావు అనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్