Monday, October 27, 2025 07:53 PM
Monday, October 27, 2025 07:53 PM
roots

సజ్జలకు ఎర్త్ పెట్టిన నారాయణ స్వామి.. తర్వాత సలహాదారే..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను దూకుడుగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తోంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే కీలక నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరి కొంతమందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉండవచ్చని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

Also Read : ఏ క్షణమైనా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్.. షాక్ ఇచ్చిన హైకోర్ట్

మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ తీసేయడానికి ఆయన సలహానే కారణమని ప్రభుత్వ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. అయితే మాజీ మంత్రి నారాయణ స్వామిని ఇటీవల సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తాను.. అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు అంగీకరించారట. సచివాలయంలో నారాయణస్వామి పేషీలోనే మద్యం సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలో కొంతమంది అధికారుల బదిలీలు కూడా నారాయణస్వామి.. సజ్జల సలహాతోనే చేసినట్లు సమాచారం.

Also Read : ఒక్కటే రాజధాని.. కానీ.. నారా లోకేష్ ఆసక్తికర కామెంట్

అయితే ఈ వ్యవహారంలో నారాయణస్వామికి ఆర్థికంగా ఎంత ప్రయోజనం చేకూరింది, లేదంటే ఆయన సన్నిహితులకు ఎంత చేకూరింది అనేదానిపై దర్యాప్తు అధికారులు ఇటీవల విచారించారు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు దొరకకపోవడంతోనే ఆయన మొబైల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి తో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను నారాయణస్వామి చెప్పడంతోనే ఆయన అరెస్టు ఆగింది అంటూ వైసీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. దీనితో మద్యం కుంభకోణం లో తదుపరి అరెస్టు సజ్జలదే కావచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ విషయంలో పక్క ఆధారాలు సేకరించిన తర్వాత అధికారులు ముందడుగు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్