Friday, September 12, 2025 05:01 PM
Friday, September 12, 2025 05:01 PM
roots

ఏపీకి కొత్తగా మరో రెండు.. కేంద్రం మంజూరు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం వరుసగా వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రం.. మరో రెండు కొత్త ప్రతిపాదనలను అంగీకరించింది. ఏపీ నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్తగా మరో వందే భారత్ రైళ్లను కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఇప్పటికే ఏపీలో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

Also Read : ఆస్ట్రేలియా టూర్ కు జట్టు ఇదేనా..?వైస్ కెప్టన్ గా అతనే..!

కేంద్ర సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ను ప్రస్తుతం నడిపిస్తోంది. మొత్తం 150 సర్వీసులు ప్రస్తుతం ప్రజలకు సేవలందిస్తున్నాయి. వీటిల్లో 75 అప్, 75 డౌన్ సర్వీసులుగా నడుస్తున్నాయి. వీటిల్లో తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ – విశాఖపట్నం – హైదరాబాద్ మార్గంలో వందే భారత్‌ రైళ్లు 130 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ఉదయం 2, మధ్యాహ్నం 2 రైళ్లు రెండు వైపులా అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు సర్వీసులు కూడా ఏపీ మీదుగానే ప్రయాణిస్తున్నాయి. వీటిల్లో హైదరాబాద్ – తిరుపతి – హైదరాబాద్ సర్వీసు నల్గొండ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా నడుస్తోంది. ఈ రైలుకు కూడా డిమాండ్ అధికంగానే ఉంది. దీంతో సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు అదనంగా మరో నాలుగు బోగీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 16 బోగీలతో నడుస్తున్న ఈ రైలు… త్వరలో 20 బోగీలతో నడవనున్నట్లు అధికారులు తెలిపారు.

విజయవాడ – చెన్నై – విజయవాడ మధ్య మరో వందేభారత్ రైలు రేణిగుంట మీదుగా నడుస్తోంది. ఈ రైలును భీమవరం వరకు పొడిగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే కేంద్ర మంత్రి శ్రీనివాసరాజు మాత్రం నరసాపురం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల రైలు వేళల్లో మార్పులు చేయాల్సి వస్తుందంటున్నారు అధికారులు. త్వరలోనే నరసాపురం – యశ్వంతపూర్ – నరసాపురం మధ్య వందే భారత్ స్లీపర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

Also Read : ఒక్కటే రాజధాని.. కానీ.. నారా లోకేష్ ఆసక్తికర కామెంట్

అయితే తాజాగా మరో రెండు వందే భారత్ రైళ్లు ఏపీకి కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిల్లో ఒకటి విశాఖపట్నం – తిరుపతి – విశాఖపట్నం మధ్య, మరొటి విశాఖపట్నం – బెంగళూరు – విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తుందని తెలిపారు. త్వరలోనే వీటి షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. విశాఖ – బెంగళూరు మధ్య దూరం ఎక్కువ కాబట్టి.. స్లీపర్ రైలు కేటాయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే ఈ రైలు ఏ మార్గం మీదుగా వెళ్తుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. విశాఖ – బెంగళూరు రైలు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల, గుంతకల్, అనంతపురం మీదుగా నడిపితే ప్రయాణ సమయం తగ్గుతుందని.. అలాగే కోస్తా, రాయలసీమ వాసులకు కూడా బాగుంటుందనే డిమాండ్ వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్